Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్.. మార్చి 16న విచారణకు రావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ

ఢిల్లీ మధ్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) కు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) భారీ షాక్ ఇచ్చింది. మార్చి 16 న ఈడీ ముందు హాజరు కావాలని రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేశాయి. గతంలో ఇదే కేసులో కేజ్రీవాల్ కు 8 సార్లు నోటీసులు ఇచ్చింది.

ఢిల్లీ మధ్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) కు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) భారీ షాక్ ఇచ్చింది. మార్చి 16 న ఈడీ ముందు హాజరు కావాలని రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేశాయి. గతంలో ఇదే కేసులో కేజ్రీవాల్ కు 8 సార్లు నోటీసులు ఇచ్చింది. గత సంవత్సరం నవంబర్2, డిసెంబర్ 21, ఈ సంవత్సరం జనవరి 3, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 27 లో ఈడీ సమన్లు పంపించింది. ఢీల్లీ సీఎం మాత్రం ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై రెండు సార్లు కోర్టులో ఫిర్యాదు చేసింది.

ఈడీ నోటీసులపై పలు మార్లు స్పందిస్తు.. ఢిల్లీ సీఎం అయిన నాకు ఈడీ సమన్లు జారీ చేయడం అన్యాయమంటు మీడియా ముఖంగా ద్వాజమోత్తారు. ఈడీ పంపించిన నోటిసులు అన్ని కూడా చట్టానికి విరుద్దంగా ఉన్నాయని.. ఈడీ సమన్లు చట్ట విరుద్దమని విరుచుకపడ్డారు. కాగా ఈ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఆప్‌ నేతల్లో ఢిల్లీ మాజీ ఢిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, పార్టీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌తో పాటు కొందరు మద్యం వ్యాపారులను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

నేను ఈడీ విచారణకు వస్తా.. కానీ ఒక్క షరతు..!

నేను ఈడీకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని.. అది కూడా మార్చి 12 తర్వాత తేదీ కావాలని ఈడీ కి విజ్ఞప్తి చేశారు. నేను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏజెన్సీ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. ఈడీ మాత్రం దానికి అంగీకరించలేదు.. కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి రావల్సిందే అని 8 సార్లు నోటిసులు పంపించింది. మరి చూడాలి గతంలో మాదిరి ఈడీకి గైర్హాజరు అవుతారా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో హాజరైవుతారా వేచి చూడాలి.

SURESH. SSM