RR vs LSG: బోణీ కొట్టిన రాజస్థాన్.. లక్నోపై విజయం..

తొలి మ్యాచ్ ఆడిన రెండు జట్లలో రాజస్థాన్ విజయంతో టోర్నీ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 193/4 పరుగులు చేసింది.

  • Written By:
  • Updated On - March 24, 2024 / 08:35 PM IST

RR vs LSG: రాజస్థాన్‌ రాయల్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆదివారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ విజయం సాధించింది. తొలి మ్యాచ్ ఆడిన రెండు జట్లలో రాజస్థాన్ విజయంతో టోర్నీ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 193/4 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. ఆ పార్టీ నుంచే పోటీ..

రియాన్ పరాగ్‌ 43 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 2 వికెట్లు, మోసీన్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌ను రాజస్థాన్ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్ ఔట్‌ చేశాడు. తర్వాత మూడో ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బదోని కూడా ఔటయ్యాడు. దీంతో 11 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్‌ ఆదుకున్నారు. రాహుల్ 44 బంతుల్లో 58 పరుగులు, పూరన్ 41 బంతుల్లో 64 పరుగులు చేసి.. లక్నో స్కోరును పరుగులెత్తించారు. కానీ, 15 ఓవర్ నుంచి లక్నో బ్యాటింగ్‌ను బౌలర్లు కట్టడి చేశారు.

దీంతో స్కోరు నెమ్మదిగా సాగింది. తర్వాత రాహుల్ ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్‌ (3), కృనాల్‌ పాండ్య (3) ఆకట్టుకోలేకపోయారు. నికోలస్‌ పూరన్‌ క్రీజులో ఉన్నప్పటికీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు 173 పరుగులకే పరిమితమైంది. 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రాజస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో బౌల్ట్‌ 2 వికెట్లు తీయగా, బర్గర్‌, అశ్విన్‌, చాహల్‌, సందీప్‌ శర్మ తలో వికెట్ తీశారు.