RRR : రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) .

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) . డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ (DVV Entertainments) బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2022 మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం నేటితో రెండు వసంతాలు పూర్తి చేసుకుంది.

‘బాహుబలి’ (Bahubali) తో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో తెలుగు సినిమా గురించి హాలీవుడ్ ప్రముఖులు కూడా మాట్లాడుకునేలా చేశాడు. జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజాలు సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, ‘నాటు నాటు’ సాంగ్ (Natu Natu’ song) కి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా వీటి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ‘నాటు నాటు’ సాంగ్ అయితే ఏకంగా ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గెలుచుకోవడం విశేషం.

ఎన్టీఆర్ (NTR) , రామ్ చరణ్ నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తాడని ఇంటర్నేషనల్ మీడియా అభిప్రాయపడింది. ఆస్కార్ రానప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో ఎన్టీఆర్, చరణ్ కి గ్లోబల్ రీచ్ వచ్చింది. ఇక దర్శకుడు రాజమౌళిని అభిమానించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెరిగింది.

కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉండేదన్న ఆలోచనతో ఫిక్షనల్ కథను రాసుకొని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ను రూపొందించాడు రాజమౌళి (SS Rajamouli) . భీమ్ గా ఎన్టీఆర్, రామ్ గా చరణ్ ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. రాజమౌళి తన మేకింగ్, మార్కెటింగ్ స్కిల్స్ ఏంటో మరోసారి నిరూపించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.