Rs 100 NOTES: పాత రూ.100 నోట్లు రద్దవుతాయా.. ఆర్బీఐ ఏం చెప్పింది..?

మరికొద్ది రోజుల్లో పాత రూ.100 నోట్లు రద్దవుతాయని, దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చెలామణి అవుతుందని, ఆ తరువాత నిషేధం విధిస్తున్నట్లు ఈ ప్రచారం సాగుతోంది.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 05:31 PM IST

Rs 100 NOTES: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.2000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను కేంద్రం వెనక్కు తీసుకుంది. ఇప్పుడు ఇదే కోవలో రూ.100 నోట్లను కూడా కేంద్రం ఉపసంహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో పాత రూ.100 నోట్లు రద్దవుతాయని, దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చెలామణి అవుతుందని, ఆ తరువాత నిషేధం విధిస్తున్నట్లు ఈ ప్రచారం సాగుతోంది.

CONG FUNDS: కాంగ్రెస్ ఖజానా ఖాళీ…కాంగ్రెస్ దగ్గర డబ్బుల్లేవా ? క్రౌడ్ ఫండింగ్ తో నిధుల వేట

దీంతో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఈ ప్రచారం వల్ల కొందరు దుకాణదారులు, వ్యాపారస్తులు పాత రూ.100 నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో రూ.100 నోట్లు కలిగి ఉన్న చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రచారంపై కొందరు ఆర్బీఐని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆర్బీఐకి కొందరు ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ తాము అలాంటి ఆదేశాలు ఏం జారీ చేయలేదని బదులిచ్చింది. రూ.100 నోట్ల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని నమ్మొద్దని కోరింది. ఎట్టి పరిస్థితిలో వంద నోట్లను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేదని, రూ.100 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ వెల్లడించింది. రూ.100 నోట్లను నిరాకరించకూడదని వ్యాపారస్తులకు తెలిపింది.