ఐపీఎల్ మెగావేలంలో యువ ఆటగాళ్ళపై కాసుల వర్షం కురుస్తోంది. నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తుషార్ దేశ్ పాండే జాక్ పాట్ కొట్టాడు. ఊహించని విధంగా రూ.6.5 కోట్లకు అమ్ముడయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ అతన్ని సొంతం చేసుకుంది. గత 3 సీజన్ల వరకు తుషార్ దేశ్ పాండే కేవలం 20 లక్షలకే చెన్నై తరపున ఆడాడు. 2023 సీజన్ లో 21 , గత సీజన్ లో 17 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా 36 ఐపీఎల్ మ్యాచ్ లలో 42 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలో బిడ్డింగ్ వేసినా తర్వాత ఆసక్తి చూపించలేదు. అటు రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ను కూడా వాడేందుకు నిరాకరించడంతో రాజస్థాన్ రాయల్స్ ఆరున్నర కోట్లకు దక్కించుకుంది.