E-RACE : రూ.54 కోట్లు కొట్టేశారు ! ఈ-రేస్ పెట్టకుండానే చెల్లింపులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తుండగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా 54 కోట్ల రూపాయలను ఓ ప్రైవేట్ కంపెనీకి చెల్లించారు. HMDAలోని ఓ సీనియర్ IAS అధికారి. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు ముందస్తుగా ఈ డబ్బులను మంత్రి, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండానే అధికారి చెల్లించారు. ఇప్పుడు ఈరేస్ రద్దవగానే... ఆ కంపెనీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని బెదిరించింది. దీనిపై దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ కు ఈ అడ్డగోలు చెల్లింపుల వ్యవహారం బయటపడింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తుండగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా 54 కోట్ల రూపాయలను ఓ ప్రైవేట్ కంపెనీకి చెల్లించారు. HMDAలోని ఓ సీనియర్ IAS అధికారి. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు ముందస్తుగా ఈ డబ్బులను మంత్రి, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండానే అధికారి చెల్లించారు. ఇప్పుడు ఈరేస్ రద్దవగానే… ఆ కంపెనీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని బెదిరించింది. దీనిపై దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ కు ఈ అడ్డగోలు చెల్లింపుల వ్యవహారం బయటపడింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేస్.. ఎందుకు తీసుకొచ్చిందో తెలీయదు. దీనికొ ప్రత్యేకంగా ఓ ట్రాక్ కూడా లేదు.. నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లను ఖాళీ చేయించి మరీ రేస్ పెట్టించారు. అదేమంటే.. ఇది ప్రతిష్టాత్మక టోర్నీ.. దీంతో కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని అప్పటి మంత్రి కేటీఆర్.. ఆయన పరివారం చెప్పుకొచ్చారు. ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చినయ్.. ఏం ఒరగబెట్టారన్నదానిపై లెక్కలేదు. అసలు ఇందులో తెలంగాణ వాళ్ళే పాల్గొనలేదు. పైగా కోట్ల రూపాయల జనం సొమ్మును రోడ్లమీద.. ఆట గాళ్ళ ప్రైజ్ మనీ మీద తగలేశారు. అప్పట్లో ఈ రేస్ పై జనం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా కేసీఆర్ ప్రభుత్వం.. మిగతా వాటిలాగే ఈ ఇష్యూని కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు.

రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక.. ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేసింది. దాంతో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో మొబైల్స్ సంస్థ.. మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ బెదిరించింది. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తే అసలు సంగతి బయటపడింది. ఆ సంస్థకు 54 కోట్ల రూపాయలను అప్పనంగా ఇచ్చేశారు HMDAకు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి. అది కూడా అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్న టైమ్ లో.. ఆ సమయంలో ఏ చెల్లింపులకైనా ఈసీ అనుమతి తప్పనిసరి. కానీ మంత్రి, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతులు ఏవీ లేకుండానే 54 కోట్ల జనం సొమ్మును ఈరేస్ నిర్వహణ కోసం ముందస్తుగా IFAకు చెల్లించారు. ఇప్పుడీ వ్యవహారం బయటపడటంతో.. ఆ ఐఏఎస్ అధికారికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. చట్ట వ్యతిరేకంగా ఒప్పందాలు కుదుర్చుకొని.. ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని ఈ నోటీసుల్లో తెలిపారు. అటు IAF కు కూడా 54 కోట్లు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం లెటర్ రాసింది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మహానగరంలో.. కాలనీలు మునిగి జనం నెలల తరబడి నీళ్ళల్లోనే మగ్గారు. వర్షాలకు రోడ్లు పాడైతే.. నడుం విరిగి, బండ్లు స్కిడ్ అయ్యి చాలామంది హాస్పిటల్స్ లో చేరారు. కానీ వీటి మీద ఎప్పుడూ దృష్టిపెట్టని బీఆర్ఎస్ సర్కార్.. ఫార్ములా ఈ-రేస్ కి మాత్రం కోట్ల రూపాయల జనం సొమ్ము తగలేసింది. ఇంకా రేస్ నిర్వహించకుండానే.. ఓ ప్రైవేట్ కంపెనీకి 54 కోట్ల రూపాయలు ఇవ్వడమేంటని జనం మండిపడుతున్నారు. ఎలాగూ నెక్ట్స్ టైమ్ కూడా బీఆర్ఎస్ సర్కారే వస్తుందన్న ధీమాతో ఆ IAS అధికారి ముందస్తుగా డబ్బులు చెల్లించారా.. అన్నది తేలాలి. గతంలో జరిగిన ఈ రేస్ కు ప్రభుత్వం ఎన్ని డబ్బులు తగలేసిందో కూడా లెక్క బయటపెట్టాలన్న డిమాండ్ హైదరాబాదీల నుంచి గట్టిగా వినిపిస్తోంది.