Cyber ​​Crimes : రూ.98 లక్షలు.. 11 బ్యాంక్‌ అకౌంట్లు.. హైదరాబాద్‌లో భారీ సైబర్‌ ఫ్రాడ్‌..

దేశంలో సైబర్‌ నేరాలు (Cyber ​​Crimes) రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు.. అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఫేక్‌ లింకులు (Fake Links) పంపి అకౌంట్లు హ్యాక్‌ (Bank Accounts) చేసేవాళ్లు కొందరైతే.. అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేవాళ్లు ఇంకొందరు. ప్రాసెస్‌ ఏదైనా చేసే పని మాత్రం డబ్బు దోచుకోవడం. ఒకప్పుడు దోపిడీ అంటే దారి దోపిడీలు, ఇంటి దోపిడీలు ఉండేవి. కానీ ఇప్పుడు దోపిడీలు కూడా డిజిటలైజ్‌ ఐపోయాయి.

దేశంలో సైబర్‌ నేరాలు (Cyber ​​Crimes) రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు.. అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఫేక్‌ లింకులు (Fake Links) పంపి అకౌంట్లు హ్యాక్‌ (Bank Accounts) చేసేవాళ్లు కొందరైతే.. అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేవాళ్లు ఇంకొందరు. ప్రాసెస్‌ ఏదైనా చేసే పని మాత్రం డబ్బు దోచుకోవడం. ఒకప్పుడు దోపిడీ అంటే దారి దోపిడీలు, ఇంటి దోపిడీలు ఉండేవి. కానీ ఇప్పుడు దోపిడీలు కూడా డిజిటలైజ్‌ ఐపోయాయి. అకౌంట్‌లో డబ్బు బాగా మెయిన్‌టేన్‌ చేసేవాళ్లను టార్గెట్‌ చేసి.. సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంటిదే హైదరాబాద్‌లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి ఫెడెక్స్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.

తన పేరుతో కొరియర్‌ వచ్చిందని.. కానీ ఆ కొరియర్‌లో మత్తు పదార్థాలు (Narcotics) దొరికాయని అధికారులు చెప్పారు. కేస్‌ బుక్‌ చేయకుండా ఉండాలి అంటే కోటి రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కేసుకు భయపడ్డ ఆ బిజినెస్‌ మ్యాన్‌ వెంటనే 98 లక్షలు వాళ్లకు ఫార్వర్డ్‌ చేశాడు. ఆ తరువాత వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశాడు. అప్పుడే తెలిసింది. తనకు కాల్‌ చేసింది కస్టమ్స్‌ అధికారులు కాదు.. సైబర్‌ నేరగాళ్లు అని. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెంటనే రియాక్ట్‌ అయ్యారు. వ్యాపారి అకౌంట్‌ నుంచి డబ్బు ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందో చూస్తే.. ఆ డబ్బు కశ్మీర్‌ లోని బారాముల్లా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జూజూ అనే వ్యక్తి అకౌంట్‌లో డిపాజిట్‌ అయ్యింది.

కానీ అధికారులు ఫోన్‌ చేసే సమయానికి ఆ అకౌంట్‌లో డబ్బు లేదు. వ్యాపారి నుంచి డబ్బు రాగానే.. ఆ డబ్బును 5 రాష్ట్రాల్లో ఉన్న వేర్వేరు బ్యాంకులకు ఫార్వర్డ్‌ చేశారు నిందితులు. వెంటనే పోలీసులు ఆ ఐదు బ్యాంకులకు కూడా కాల్‌ చేశారు. కానీ అప్పటికే ఆ బ్యాంకుల నుంచి కూడా మరో 6 వేర్వేరు బ్యాంకులకు డబ్బు ఫార్వర్డ్‌ అయ్యింది. నిందుతుల నెట్‌వర్క్‌ స్పీడ్‌ చూసి పోలీసులు కూడా షాకయ్యారు. వెంటనే ఆ ఆరు బ్యాంకులకు కూడా కాల్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పి అకౌంట్స్‌ ఫ్రీజ్‌ చేయించారు. కానీ అప్పటికే నిందుతులు ఆ డబ్బులో నుంచి 15 లక్షలు విత్‌డ్రా చేసుకున్నారు.

మిగిలిన డబ్బు మాత్రం సేఫ్‌గా వెనక్కి తీసుకురాగలిగారు పోలీసులు. నిజానికి ఇక్కడ పోలీసుల వర్కింగ్‌ స్పీడ్‌ కూడా అదుర్స్‌. నిందితులు ఇన్ని బ్యాంక్‌ అకౌంట్స్‌ మార్చినా.. వెంటనే వాళ్లందరికీ ఫోన్లు చేస్తూ డబ్బు మిస్‌ అవకుండా చూశారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును ఈ స్థాయిలో మళ్లీ వెనక్కి తీసుకురాగలగడం ఇదే తొలిసారి. ఇలాంటి కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పోలీసులు. అన్‌ నోన్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే కాల్స్‌ మెసేజెస్‌కు రెస్పాండ్‌ కావొద్దని చెప్తున్నారు.