ప్రతిపక్ష నేతలంతా కార్మికులకు అండగా నిలిచారు. రోజులు గడుస్తున్నాయి. నెలలు మారుతున్నాయి. బస్సులు మాత్రం రోడ్డెక్కడంలేదు. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు. మధ్యలో సామాన్య ప్రజానీకం రవాణా సదుపాయం లేక నరకం చూశారు. మూడు నెలలకు పైగా ఓపిక పట్టిన ప్రభుత్వం ఇక చర్చలత ఫలితం లేదని భావించింది. ఉద్యోగులందరినీ విధులను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా చట్టం ప్రయోగించి అందరి ఉద్యోగాలు తీసేసింది.
దీంతో కార్మికులు విలవిలలాడిపోయారు. వాళ్లు చేస్తున్న సమ్మెను పక్కన పెట్టి తిరిగి ఉద్యోగాలు ఇస్తే చాలంటూ సమ్మె విరమించారు. దీంతో కార్మికులందరినీ సీఎం కేసీఆర్ ఇంటికి పిలిచి మట్లాడారు. వెంటనే తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలని చెప్పారు. సమ్మె విషయం డిమాండ్ల విషయం మర్చిపోయారు కార్మికులు. ప్రభుత్వం మొండి వైఖరిని పక్కకు పెట్టేశారు. తమ ఉద్యోగం తమకు వచ్చిందన్న సంతోషం తప్ప.. కేసీఆర్ ప్రభుత్వం మీద కోపం వాళ్ల కళ్లలో కనిపించలేదు. అంటే వాళ్లు ఏ స్థాయిలో భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
వాళ్లే కాదు.. ఉద్యోగమే జీవానాధారంగా బతికే ప్రతీ ఉద్యోగి అంతే. అందుకే ఇప్పుడు జూనియర్ పంచాయత్ సెక్రటరీల విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ ప్లే చేసింది తెలంగాణ ప్రభుత్వం. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు పలు డిమాండ్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు జూనియర్ పంచాయత్ సెక్రెటరీలు. ఎప్రిల్ 28 నుంచి డ్యూటీలు బైకాట్ చేసి నిరవదిక సమ్మెకు దిగారు. దాదాపు 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోలేదు.
సమ్మె విరమించి వెంటనే విధులకు వెళ్లాలని సూచించింది. కానీ ఉద్యోగులు మాత్రం తగ్గలేదు. దీంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తీసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ల స్థానంలో కొత్త వారిని తీసుకోబోతున్నట్టు ప్రకటించింది. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు జేపీఎస్‌లు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. సమ్మె సంగతి దేవుడెరుగు ఉద్యోగం ఉంటే అదే ఎక్కువ అనుకుని వెంటనే వెళ్లి డ్యూటీల్లో జాయిన్ అయ్యారు.
జేపీఎస్‌ల సంఘం రాష్ట్ర కమిటీ నేతలు మాత్రం మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. తాము డ్యూటీల్లో జాయిన్ అవుతాం కానీ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని కోరారు. బయటికి వచ్చి ప్రభుత్వం మీద తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇక్కడే ఓ చిన్న క్వశ్చన్. ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉంటే అసలు సమ్మె చేయడం దేనికి. ఒకవేళ చేసినా ఉద్యోగం తీసేవరకూ ఎందుకు వెనక్కి తగ్గలేదు. మీకుంది నమ్మకమా భయమా. అప్పుడు కలగని నమ్మకం ఇప్పుడు ఎందుకు కలిగింది.
అప్పుడు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఇప్పుడు జేపీఎస్‌లు కావచ్చు. వెనక్కి తగ్గడానికి ఒకటే రీజన్. ఉద్యోగం లేకపోతే బతుకుదెరువు లేకపోవడం. ఇదే వీక్‌నెస్‌తో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం వాళ్లతో చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించడం దారుణమంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ అణచివేత ధోరణి ప్రభుత్వానికి సరికాదంటున్నారు.