Vladimir Putin: మళ్లీ అధికారం పుతిన్‌దే.. రష్యాలో మొదలైన పోలింగ్..!

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అక్కడ పుతిన్ మరోసారి అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవడం ఖాయంగా ఉంది. గతంలో ఒక్కరోజే ఎన్నికలు జరిగేవి. కానీ, ఇప్పుడు మూడు రోజులపాటు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పుతిన్ తొలిసారిగా 2000లో అధ్యక్ష పదవి చేపట్టారు.

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 02:40 PM IST

Vladimir Putin: రష్యాలో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 15, 16, 17 తేదీల్లో మూడు రోజులపాటు ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అక్కడ పుతిన్ మరోసారి అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవడం ఖాయంగా ఉంది. గతంలో ఒక్కరోజే ఎన్నికలు జరిగేవి. కానీ, ఇప్పుడు మూడు రోజులపాటు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పుతిన్ తొలిసారిగా 2000లో అధ్యక్ష పదవి చేపట్టారు. అప్పటినుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు.

Pithapuram Issue: అసమ్మతి సెగ.. పవన్‌కు పిఠాపురం సీటు.. రచ్చ.. రచ్చ..

పుతిన్ వరుసగా నాలుగు సార్లు (2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ కొనసాగారు. ఇప్పుడు 2024లో గెలిస్తే 2030 వరకు అధ్యక్షుడిగా ఉంటారు. పుతిన్‌కు పోటీగా న్యూ పీపుల్‌ పార్టీ అభ్యర్థిగా వ్లాదిస్లేవ్‌ దవాన్‌కోవ్, లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ రష్యా (ఎల్‌డీపీఆర్‌) తరఫున అభ్యర్థిగా లియోనిడ్‌ స్లట్‌స్కీ, కమ్యూనిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా నికోలే ఖరిటోనోవ్‌లు పోటీ చేస్తున్నారు. పోలింగ్ అంచనాల ప్రకారం పుతిన్‌కు 75 శాతం ప్రజల మద్దతు ఉందని సర్వేలు చెబుతున్నాయి. మిగతా పోటీదారులు తలో 5-10 శాతం వరకు ఓట్లు రావొచ్చని అంచనా. ఈసారి రష్యా అధీనంలో ఉన్న ఉక్రెయిన్‌ భూభాగంలోనూ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్‌ యోచిస్తున్నారు. రష్యా ఓటర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ.. తగిన అర్హతలుంటే ఓటేయొచ్చు. మన దేశంలోని కేరళలోనూ రష్యా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి.

మరోవైపు పుతిన్‌పై అనేక ఆరోపణలున్నాయి. ఆయన పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడల్ని అనుసరిస్తున్నారని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. విదేశీ మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తుంటుంది. ఇక.. ఇటీవలే మరణించిన మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ ప్రభావం పుతిన్‌‌పై ఉంటుందా అనే అంచనాలున్నాయి. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడవుతాయి. తుది ఫలితాలు రావాలంటే మాత్రం మార్చి 29దాకా ఆగాల్సిందే. పుతిన్ తాను మరో రెండుసార్లు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టాన్ని మార్చారు. తాజా ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్‌ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు.