Luna-25: రష్యా మూన్‌ మిషన్‌ ఫెయిల్‌.. ల్యాండింగ్‌కు ముందే పేలిపోయిన లూనా25..

చంద్రమండలం పై కాలు పెట్టేందుకు ప్రయత్నం చేసిన రష్యాకు నిరాశ ఎదురైంది.

  • Written By:
  • Publish Date - August 20, 2023 / 05:10 PM IST

మూన్‌ మిషన్‌లో రష్యాకు పెద్ద షాక్‌ తగిలింది. దాదాపు 47 ఏళ్ల తరువాత రష్యా చేపట్టిన మూన్‌ మిషన్‌ ఫెయిల్‌ అయ్యింది. చంద్రడిపై ల్యాండ్‌ అవ్వకుండానే రష్యా ప్రయోగించిన లూనా-25 క్రాష్‌ అయ్యింది. ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న టైంలో స్పేస్‌ షిప్‌ క్రాష్‌ అయినట్టు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోస్మోస్‌ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాలకు లూనా-25తో కమ్యూనికేషన్‌ పోయిందని రష్యా ప్రకటించింది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌ నిర్వహించిన రోస్కోస్మోస్‌.. ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మూన్‌ మిషన్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్యాకు ఈ క్రాష్‌ ఊహించని షాకిచ్చింది. దాదాపుగా 5 దశాబ్ధాల తరువాత మళ్లీ మూన్‌ మిషన్‌ చేపట్టింది రష్యా. చంద్రుడిపై నీటి జాడలు కనుక్కోవడమే లక్ష్యంగా ఆగస్ట్‌ 11న రష్యా ఈ లూనా-25ని ప్రయోగించింది. టేకాఫ్‌ సక్సెఫుల్‌గా తీసుకున్న లూనా25 రీసెంట్‌గానే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి నమూనాలను సేకరించి పరిశోధన జరపాలనేది లూనా25 లక్ష్యం. రెండు రోజుల క్రితం చంద్రుడికి అత్యంత దగ్గరికి చేరుకున్న లూనా25లో అనుకోకుండా సాంకేతిక లోపం ఏర్పడింది. స్పేస్‌ క్రాఫ్ట్‌ స్పీడ్‌ తగ్గించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆటోమేటిక్‌ స్టేషన్‌లో ఏర్పడిన అత్యవర పరిస్థితి కారణంగా లూనా25 వేగం తగ్గించేందుకు వీలు కాలేదు. దీంతో లూనా25 క్రాష్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూపు ఇండియా ప్రయోగించిన చంద్రయాన్‌3 పైనే ఉంది. ఇప్పటికే స్పేస్‌ క్రాఫ్ట్‌ నుంచి ల్యాంర్‌ విడిపోయింది. ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవం దగ్గర చంద్రయాన్‌3ని సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది.