Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా షర్మిల ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడొచ్చి పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా వ్యవహరిస్తోందని విమర్శించారు ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వైఎస్ షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోంది. కోవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా టీడీపీ కుట్ర చేస్తోంది.
Cyber Safety: ఫేక్ మెసేజెస్ వస్తున్నాయా.. ఇలా గుర్తించండి..
చంద్రబాబు కక్షతో, తన ఏజెంట్ నిమ్మగడ్డతో వలంటీర్ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయించారు. అధికారులపైనా చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది. టీడీపీ.. వాలంటీర్లపై విష ప్రచారం చేయడంతో ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను ఈసీ ఆపేసింది. పెన్షన్లపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ వల్ల రెండ్రోజుల్లో ఫించన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడది ఆలస్యం అయ్యింది. దీంతో పెన్షనర్షలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అదే అహంకారం, అదే లెక్కలేని తనం. ఇది చంద్రబాబు రాక్షసమనస్తత్వానికి నిదర్శనం. అలాంటి రాక్షస మనస్తతత్వం ఏ నాయకుడిలో చూడలేదు. దురదృష్టవశాత్తూ.. ఎండల వల్ల కొందరు చనిపోయారు. రావణుడిలా చంద్రబాబు మారువేషంలో ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే మిగిలింది. చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు కూటమిలో సీట్లు ఇచ్చేలా చేశారు. రెండు పార్టీల్లోనూ తనవాళ్లకే టికెట్లు ఇప్పించుకున్నారు. చంద్రబాబు ఏజెంట్‌గా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు మేలు చేయడమే పురంధేశ్వరి ఎజెండా.
అయినా 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని షర్మిల.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారు. తెలంగాణ నుంచి హఠాత్తుగా షర్మిల ఎందుకు మాయం అయ్యారో సమాధానం చెప్పాలి. తెలంగాణ నుంచి ఏపీ వచ్చి కాంగ్రెస్ బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు..? వాటిని ఎవరిచ్చారు..? కాంగ్రెస్‌తో కొట్లాడుతానని తెలంగాణలో పార్టీ పెట్టారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు. మరో నెలలో ప్రజా కోర్టులో ఇదంతా తేలుతుంది. మేమంతా సిద్దం సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు” అని సజ్జల వ్యాఖ్యానించారు.