SALAAR REVIEW: లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్.. ఇవన్నీ క్రూర మృగాలే. కానీ అడవిలోనే. జురాసిక్ పార్క్‌లో కాదు. సినిమా కోసం ఈ డైలాగ్ రాశారో.. లేక ఈ డైలాగ్ రాశాక సినిమా తీశారో తెలియదు కానీ.. నిజంగా ఇలానే ఉంది సలార్. సినిమా ప్రపంచంలో ప్రభాస్‌ని ఓ డైనోసర్‌లా చూపించాడు ప్రశాంత్ నీల్. సలార్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు.. మరికొన్ని గంటల్లో కన్నుల విందు జరగబోతోంది. సలార్ సినిమా కొన్ని గంటల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
PRABHAS: సలార్ ఇంట్రో సీన్ బాబోయ్.. మెంటలెక్కిపోతారు
కానీ ఇప్పటికే సినిమా యూనిట్, మీడియా కోసం ప్రీమియర్ షోలు వేశారు. ఆ ప్రీమియర్ షో ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సలార్ బొమ్మ దద్దరిల్లిపోయినట్టు తెలుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వస్తున్న సలార్ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని కాపాడేందుకు హీరో ప్రభాస్ విలన్స్‌తో యుద్ధానికి కూడా సిద్ధమవుతాడు. ఒక్కడే సైన్యంగా స్నేహితుడి కష్టాలు తీరుస్తాడు. కానీ చివరికి స్నేహితుడే ప్రభాస్‌కు శతృవుగా మారిపోతాడు. అసలు ప్రభాస్‌కు అతని స్నేహితుడికి మధ్య ఏం జరిగింది. ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకున్న స్నేహితుడు బద్ధ శతృవుగా ఎందుకు మారాడు అనేది సలార్ కథాంశం. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయాల గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది.
ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్, చున్నీ ఫైట్ రెండూ ఐకానిక్ సీన్లుగా నిలవబోతున్నాయి. కనిపించేందుకు కాస్త కేజీఎఫ్‌లా ఉన్నా.. అంతకుమించిన ఎలివేషన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు హైప్ ఎక్కించేందుకు రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. అబ్బా.. కేజీఎఫ్.. ప్రభాస్ చేసి ఉంటే బాగుండు అని అప్పట్లో ఫీలైన డార్లింగ్ ఫ్యాన్స్‌కు.. ఆ లోటు ఇప్పుడు తీరిపోబోతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ను ఎంత వైలెంట్‌గా చూపించాడో.. అంతే ఎమోషనల్‌గా కూడా చూపించాడు డైరెక్టర్. విలన్స్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా భీకరంగా ఉంటుంది. కానీ ప్రభాస్ కటౌట్‌కు అది కరెక్ట్‌గా సరిపోయింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సందీప్ రెడ్డి ఝలక్
సినిమాటోగ్రఫీ అయితే నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. ఇక మ్యూజిక్.. ప్రతీ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. ఆకలితో ఉన్న సింహంలా ప్రభాస్ చేసిన యాక్టింగ్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సింపుల్‌గా చెప్పాలంటే.. మంచి హిట్ కోసం ఆకలిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు సలార్ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.