బడా హీరోల సినిమాలకు OTT సంస్థల డిజిటల్ పంచ్..
సలార్ మూవీ తెలంగాణ రైట్స్ 90 కోట్లు, ఆంధ్రా రైట్స్ 110 కోట్లు, సీడెడ్ 25 కోట్లు.. ఈలెక్కలు వింటేనే సలార్ వెయ్యి కోట్లు దాటేస్తుందనుకోవచ్చు. మరి ఈ లెక్కన అన్ని భాషల్లో డిజిటల్ రైట్స్ ఎంతుండొచ్చంటే, అక్కడే పంచ్ పడేలాఉంది
పెద్ద హీరోల సినిమాలకు ఇక పెద్ద ఎమౌంట్ కష్టమే.. ?
టాలీవుడ్ లో ఓ మూవీ రిలీజ్ కాబోతోందంటే, 60శాతం పెట్టుబడిని డిజిటల్ రైట్స్ రూపంలో రాబట్టేస్తారు. మిగిలిన 40శాతం పెట్టుబడిని, శాటిలైట్ రైట్స్, ఆడియోరైట్స్ తో రాబడుతారు.. ఇక థియేట్రికల్ రైట్స్ తో వచ్చేదంతా ప్రాఫిట్టే.. పెద్ద హీరోల సినిమాలకైతే కొన్ని సార్లు శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ తో పెట్టుబడి వెనక్కి రావటమే కాదు, లాభాలు కూడా వస్తాయి. ఇక థియేట్రికల్ రైట్స్ బోనల్ కిందే లెక్క… సినిమా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్లకు పంచ్ కాని, నిర్మతకొచ్చే ఇబ్బందేం ఉండదు..
డిజిటల్ మార్కెట్ ని పిండుకుంటున్న నిర్మాతలకు చుక్కలు..
నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ఇంకా ఇతర ఓటీటీ సంస్థలు పెద్దహీరోల పెద్ద మూవీలను భారీ ఎమౌంట్ కి కొనకూడదని నిర్ణయించుకున్నాయట. విచిత్రం ఏంటంటే సినిమా మొత్తం బడ్జెట్ లో 60శాతం పెట్టుబడిని డిజిటల్ రైట్స్ తోనే రాబట్టాలనుకునే నిర్మాతల అత్యాశే అందుక్కారణం అంటున్నారు
సలార్ బడ్జెట్ 400 కోట్లు కాని ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ 240 కోట్లట. ఇక కల్కి 2898 బడ్జెట్ 700 కోట్లైతే, 420 కోట్లు అన్ని భాషల డిజిటల్ రైట్స్ కి డిమాండ్ చేస్తోంది ఫిల్మ్ టీం. ఇక ఓజీ డిజిటల్ రైట్స్ 220 కోట్లని, గుంటూరు కారం 150 కోట్లని, ఇలా ఇంతింత డిమాండ్ చేస్తే ఓటీటీ సంస్థలు మాత్రం ఎక్కడినుంచి తెస్తాయి. అసలే ఓటీటీ మార్కెట్ గత రెండేళ్ళుగా నష్టాల్లో ఉంటోంది. కాబట్టే ఓటీటీ సంస్థలన్నీ కూర్చుని బడ్జెట్ లో 35 శాతం మించి రైట్స్ కి ధర చెప్పకూడదని, ఒకవేల అంతకుమించి ఏ సినిమా టీం డిమాండ్ చేసినా ఆ రైట్స్ కొనకూడదని సిండికేట్ అయ్యారట. ఇదే జరిగితే భారీ బడ్జెట్ మూవీలకు డిజిటల్ కష్టాలు తప్పవు.