దసరాకు రావాల్సిన ట్రైలర్ దీపావళికి వస్తే కనీసం ఫ్యాన్స్ అలా అయినా సంతృప్తి పడే ఛాన్స్ ఉంది. కాని అది జరుగుతుందా? ఎందుకంటే ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా పర్ఫెక్షనిస్టు.. అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు సినిమాను చెక్కుతూనే ఉంటాడు.
ఆ ప్రాసెస్ లోనే క్లైమాక్స్ సీన్స్ రిపేర్లు చేస్తున్నాడు. మరి ఆ సీన్ లేకుండా ట్రైలర్ వదలొచ్చు కదా అంటే, పక్క క్లైమాక్స్ లో ఓ షాట్ ని ట్రైలర్ లో ప్లాన్ చేస్తున్నాడట. అందుకే దసరాకు ట్రైలర్ వదల్లేదని, ఆ షాట్ గ్రాఫిక్స్ దీపావళి లోగా పూర్తవ్వొచ్చని తెలుస్తోంది. అయినా నవంబర్ చివర్లోనే ట్రైలర్ ని రిలీజ్ చేయాలని ఫిల్మ్ టీం అనుకుంటోందట. కాని దసరాకు అది కూడా ప్రభాస్ బర్త్ డేకి ట్రైలర్ రాకపోవటంతో ఫ్యాన్స్ లో పెరిగిన డిసప్పాయింట్ మెంట్ చూసి ప్రశాంత్ నీల్ కూడా దీపావళికి ఎట్టిపరిస్తితుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ చేయాలనే నిర్ణయానికొచ్చాడట.
ఇక శంకర్ అయితే దీపావళికి గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అని ఎనౌన్స్ చేశాడు. ఎటొచ్చి గుంటూరుకారం సాంగ్ రిలీజ్ డేటే తేలలేదు. త్వరలో అనటం బట్టి చూస్తే ఈనెలాఖర్లోగా వస్తుందా అంటే ఏ అకేషన్ లేకేండా ఏ డేట్ కి పాటని వదిలిని లెక్కలోకి రాదు. కాబ్టటే దీపావళికి అంటే మరో 15 రోజుల్లో గుంటూరు కారం వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.