Samantha: సల్మాన్‌ఖాన్‌తో సమంత రొమాన్స్‌..

సమంత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సిద్దమైందా.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 03:03 PM IST

సమంత బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే.. అవును అనే అనిపిస్తోంది. వరుస ఫ్లాప్స్‌తో డల్‌గా ఉన్న సమంత.. రీసెంట్‌గా ఖుషి మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఇదే జోష్‌లో ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందని టాక్. ఫుల్ లెంగ్త్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడీగా… బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో సల్మాన్‌కు జోడీగా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట కరణ్. ఈ మధ్యే రిలీజ్‌ అయి సూపర్ హిట్‌గా నిలిచిన జవాన్ సినిమాలో షారుఖ్ జోడీగా సౌత్ బ్యూటీ నయనతార యాక్ట్ చేసింది. ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. సల్మాన్ పక్కన సౌత్ హీరోయిన్‌ను పెట్టాలని కరణ్ డిసైడ్ అయ్యాడని టాక్‌. అందుకే ఈ సినిమా కోసం సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఫారిన్ టూర్‌లో ఉంది. ఏడాది విరామం పూర్తి కాకముందే సమంతకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. పుష్ప మూవీలో స్పెషల్‌ సాంగ్‌తో పాటు.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సామ్‌ దగ్గరయింది.

ఈ క్రేజ్‌ను యూజ్ చేసుకోవాలని కరణ్‌ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పంజా మూవీ తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో.. ఈ మూవీ రాబోతోంది. ఐతే సమంతతో పాటు త్రిష, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఐతే సమంతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జవాన్ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న కరణ్ అండ్ సల్మాన్ కంబోకు సమంత వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.