ఏపీలో ఇసుక డోర్ డెలివరి… కిలోమీటర్ కు ఎంతంటే…?

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక డోర్ డెలివరీ కోసం ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. వచ్చేవారం నుంచి ఇసుక డోర్ డెలివరీ కార్యక్రమం అమలు కానుంది. టన్నుకి కిలోమీటర్ కు 12 రూపాయలు మేరా డోర్ డెలివరీ ఛార్జ్ చేయనున్నారు.

  • Written By:
  • Publish Date - September 13, 2024 / 03:51 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక డోర్ డెలివరీ కోసం ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. వచ్చేవారం నుంచి ఇసుక డోర్ డెలివరీ కార్యక్రమం అమలు కానుంది. టన్నుకి కిలోమీటర్ కు 12 రూపాయలు మేరా డోర్ డెలివరీ ఛార్జ్ చేయనున్నారు. డోర్ డెలివరీ చేయడానికి 3000 లారీలు సిద్ధం చేసారు అధికారులు. మరికొన్ని లారీలు వచ్చే అవకాశం ఉంది. ఇసుక పంపిణీ లో అక్రమాలు జరగకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుడింటికి వెళ్లడానికి జిపిఎస్ విధానం అమలు చేయనుంది ప్రభుత్వం.

ఇసుక స్టాక్ పాయింట్ నుంచి పది కిలోమీటర్ల లోపు అయితే టన్నుకు 12 రూపాయలు రోడ్డులో చార్జ్ చేస్తారు. 40 కిలోమీటర్లు అయితే టన్నుకు ఆరు రూపాయలు చొప్పున చార్జ్ చేయాలని ప్రతిపాదించారు. ఇటీవల ఇసుక విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలువురు విమర్శలు చేయడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.