Sankranti holidays : సంక్రాంతి సెలవులు విడుదల.. వరుసగా ఆరు రోజులు హాలిడేస్

కొత్త సంవత్సరం వచ్చింది అంటే చాలా స్కూల్ విద్యార్థులకు తెగ సంతోషం.. ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు జనవరి నుంచి సెలవులు మొదలవుతాయి. హాలిడేస్ కోసం ఎదుకు చూస్తున్న వారు సంక్రాంతితో వరుస సెలవులు పొందుతారు. తాజాగా ప్రభుత్వ స్కూల్స్ కు తెలంగాణ సర్కార్ సెలవులు ప్రకటించింది.

జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. కాగా జనవరి 12న ఆప్షనల్ హాలీడే, 13న 2వ శనివారం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఇలా వరుసగా ఉన్నాయి. అలాగే జనవరి 25, 26న కూడా హాలీడే రానుంది. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులపై క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ పండుగ హడావుడి కనిపించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పంట పోలాలు.. సోతూళ్లు. తెలంగాణ కన్న ఏపీలో సంక్రాంతి పండుగ అంబరాన్ని తాకుతుంది. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో ప్రతి ఇళ్లు వెలిగిపోతుంది. ఇక పండు వేళ హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది.