MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?

ఈ కేసును విచారిస్తున్న ఈడీ.. కవితకు నోటీసులు జారీ చేసి, పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆమె నివాసంతోపాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కూడా కవిత.. విచారణకు హాజరయ్యారు.

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 01:58 PM IST

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఈడీ.. కవితకు నోటీసులు జారీ చేసి, పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆమె నివాసంతోపాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కూడా కవిత.. విచారణకు హాజరయ్యారు. అయితే, అనంతరం మళ్లీ విచారణకు రావాల్సిందిగా ఈడీ.. కవితకు నోటీసులు ఇచ్చింది. కానీ, కవిత విచారణకు హాజరుకావడం లేదు.

PayTM Shares : పుట్టెదు కష్టాల్లో పేటీఎం… స్టాక్ మార్కెట్లో పతనం… 20 వేల కోట్లకు పైగా నష్టం

మహిళల విచారణ విషయంలో ఈడీ నిబంధనలు పాటించడం లేదని, అందువల్ల తాను ఈడీ విచారణకు హాజరుకాలేనని కవిత.. ఈడీకి తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు కూడా దాఖలు చేసింది. తనను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కొంతకాలంగా కోర్టులో విచారణ సాగుతోంది. అయితే, ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు తాను విచారణకు హాజరుకాలేనని కవిత.. ఈడీకి తెలిపింది. తాజాగా సోమవారం.. ఈ కేసుపై సుప్రీంలో విచారణ సాగింది. గతంలో ఇదే తరహా పిటిషన్ దాఖలు చేశారు నళిని, చిదంబరం. అందువల్ల.. రెండు వేర్వేరు కేసుల్లోని గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. కవిత, ఈడీ సమన్లు తీసుకోవడం లేదని, విచారణకు హాజరుకావడం లేదని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు.

ఈ నేపథ్యంలో.. గతంలో సుప్రీం కవితకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, నోటీసులు ఇవ్వొద్దని సూచించింది. దీనిపై తాజాగా కోర్టులో ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు నిర్ణయం ఒక్కసారికే కాని.. ప్రతిసారి కాదని ఈడీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. 16న జరిగే విచారణ సందర్భంగా అన్ని వివరాలు పరిశీలిస్తామని తెలిపింది. దీంతో 16న జరిగే విచారణ కవిత కేసులో కీలకం కానుంది.