హైడ్రా పేరు చెప్తే చాలు రియల్టర్ల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అన్నీ రూల్స్ ప్రకారం ఉన్న బిల్డింగ్స్ ఐతే ఓకే. కానీ కాస్త అటూ ఇటూగా ప్రాపర్టీ ఉంటే చాలు.. దయా దాక్షిన్యాలు లేకుండా కూల్చేస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. దీంతో ఎప్పుడు నోటీసులు వస్తాయో ఎప్పుడు బిల్డింగులు పడిపోతాయో తెలియక చాలా మంది రియల్టర్లు వణికిపోతున్నారు. ఇదే భయాన్ని ఆసరాగా తీసుకుని కొత్త దందాకు తెర లేపాడు బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి. బయటికి చూడా సామాజిక కార్యకర్త.. కానీ లోపల చేసేది మొత్తం బ్లాక్‌మెయిల్ దందా. ఇదే మనోడి స్టైల్. డాక్యుమెంట్స్ సరిగ్గాలేని ప్రాపర్టీలు వెతకడం ఓనర్లని బెదిరించి డబ్బు వసూలు చేయడం. ఇదే మనోడి బిజినెస్. ఇక హైడ్రా కూడా రావడంతో దాన్ని కూడా తన దందాకు వాడుకుంటున్నాడు సిన్హా. కాంగ్రెస్ మంత్రులు, అధికారులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తనను తాను ఓ పెద్ద పర్సనాలిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. బఫర్ జోన్, FTL పరిధిలో నిర్మాణం అవుతున్న, అయిన బిల్డింగ్‌లను టార్గెట్ చేశాడు. తాను హైడ్రా రంగనాథ్‌కు చాలా దగ్గరి వ్యక్తినని.. తానకు డబ్బులిస్తే బిల్డింగ్ పడగొట్టకుండా ఉండేందుకు రంగనాథ్‌తో మాట్లాడి సొల్యూషన్ చూపిస్తానంటూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా చాలా మందిని బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్న క్రమంలో.. ఓ బిల్డర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో విప్లవ సిన్హా వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది. కేవలం ఇతను మాత్రమే కాదు. హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో చాలా మంది రిపోర్టర్లు కూడా ఇలాంటి దందాలు చేస్తున్నారని రియల్టర్లు చెప్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ప్రాపర్టీ మీద వార్తలు రాసి కూలగొట్టేలా చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వాళ్ల ఆరోపణలు ఎలా ఉన్నా.. అక్రమ నిర్మాణాల పడగొట్టేందుకు హైడ్రాను తీసుకువస్తే.. దాన్ని కూడా తమ దందాలకు వాడుకుంటున్న వీళ్ల తీరు చూసి అధికారులే షాకవుతున్నారు.