Moon’s South Pole: చంద్రుడి దక్షిణ ధృవం ఎందుకంత ప్రమాదకరం

చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోంది. చంద్రుడిపై సూర్యుడి వెలుగు పడగానే విక్రమ్‌ ల్యాండర్‌ను దింపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 12:56 PM IST

చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోంది. చంద్రుడిపై సూర్యుడి వెలుగు పడగానే విక్రమ్‌ ల్యాండర్‌ను దింపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. చంద్రుడి సౌత్‌పోల్‌ మీద సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్‌-3 అడుగుపెట్టబోతోంది. అయితే ఇప్పుడు ప్రతీ ఒక్కరనీ కలవరపెడున్న అంశం చంద్రుడి సౌత్‌పోల్‌ దగ్గరి వాతావారణం. ఇప్పటి వరకూ ఏన్నో దేశాలు సౌత్‌పోల్‌ మీద సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. రీసెంట్‌గా రష్యా మూన్‌ మిషన్‌ లూనా25 కూడా క్రాష్‌ ల్యాండ్‌ జరిగింది.

చంద్రుడి సౌత్‌పోల్‌ ఎందుకు అంత ప్రమాదకరం? ఇంతకీ అక్కడ ఏముంది? ప్రపంచం మొత్తం భయపడుతున్నా.. ఇండియా మాత్రం సౌత్‌పోల్‌లో సాఫ్ట్‌ ల్యాండ్‌ చేస్తామని ఎలా ధీమాగా ఉంది? ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్నలు ఇవే. చంద్రుడి మొత్తం ఉపరితలంతో కంపేర్‌ చేస్తే ఈ సౌత్‌ పోల్‌ దగ్గర ఉండే వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ పగలు ఉష్ణోగ్రత 54 డిగ్రీలకు పైనే ఉంటుంది. రాత్రి సమయంలో మాత్రం మైనస్‌ 200 డిగ్రీల చలి ఉంటుంది. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో కాదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయట. కనీసం సూర్యుడి వెలుగు తాకని చాలా ప్రదేశాలు చంద్రుడి సౌత్‌పోల్‌లో ఉన్నాయి. భూగ్రహం ఏర్పడ్డప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో.. చంద్రుడి సౌత్‌పోల్‌లో కూడా అలాంటి వాతావరణ పరిస్థితులే ఉన్నాయంటున్నారు సైంటిస్టులు.

అందుకే ఈ ప్రదేశం అత్యంత భయానక ప్రాంతమని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకూ జరిగిన అన్ని ప్రక్రియలను చంద్రయాన్‌-3 విజయవంతంగా కంప్లీట్‌ చేసింది. ప్రస్తుతం తన స్పీడ్‌ను తగ్గిస్తూ చంద్రుడిపై ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్‌-3 ప్రతీ మూమెంట్‌ను బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు మానిటర్‌ చేస్తున్నారు. ల్యాండింగ్‌కు సంబంధించిన ప్రోగ్రాంను రెడీ చేశారు. చంద్రుడి సౌత్‌పోల్‌ మీద సూర్యుడి వెలుగు పడిన వెంటనే ల్యాండింగ్‌ ప్రాసెస్‌ సార్ట్‌ చేస్తారు. చంద్రుడి ఉపరితలంపై భారత జెండా ఎగిరే ఆ ఉద్విగ్నభరిత క్షణం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.