Scorpion Venom: తేలు విషంతో అనేక ప్రయోజనాలు.. దీని ధర కోట్లలోనే

సాధారణంగా కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. మరి కొందరైతే పాములు పెంచుకోవడం చూస్తూ ఉంటాం. తాజాగా తేళ్లను పెంచే వీడియో సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ గా మారింది. అసలు తేళ్ళతో ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 08:48 AM IST

తేళ్ళు వీటికి విషం కొండీలో ఉంటుందన్న విషయం అందరికీ తెలసిందే. ఇవి కుడితే తీవ్రమైన మంటతోపాటూ ఈ విషం ప్రాణాలను తీస్తుంది. అయితే కొందరు తాజాగా తేళ్లను పెంచుతూ.. వాటికి ఆహారాన్ని వేసే వీడియో ట్విట్టర్లో ట్రెండింగా నిలిచింది. గతంలో పాములను పెంచడం చూశాం. కానీ తేళ్ల ను పెంచడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వీటికోసం ప్రత్యేకంగా ఒక తొట్టెను ఏర్పాటు చేశారు. అందులో కొన్ని అరలను అమర్చారు. అసలు ఇన్ని తేళ్ళను ఇంత శ్రద్ధగా పెంచడానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తేళ్ల వల్ల అనేక రకాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని ఇంత ప్రత్యేకంగా పెంచుతున్నారు. తేలు విషాన్ని ఉపయోగించి అనేక ఔషధాలు తయారు చేస్తారు. దీని విషంతో క్యాన్సర్ తో పాటూ అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. అలాగే కొన్ని చర్మసౌందర్య లేపనాలలో, కాస్మొటిక్స్ లో వాడతారు. తేళ్ల విషాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూలింగ్ కంటైనర్స్ లో నిల్వచేస్తారు. ఇవి రోజుకు రెండు మిల్లీ గ్రాములు విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని సేకరించేందు కొంత శ్రమించాల్సి ఉంటుంది. ఒక లీటరు తేలు విషం ధర అంతర్జాతీయ మార్కెట్లో 10 మిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 74 కోట్ల 15 లక్షలు అనమాట.

T.V.SRIKAR