టీ ట్వంటీ ఫార్మాట్ లో ఎక్కువ శాతం బ్యాటర్లదే హవా.. తాజాగా య్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పరుగుల వరద పారుతోంది. టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీకి ఈ టోర్నీ వేదికగా నిలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది. టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు. పొట్టి ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.