Ujjain Mahankali : అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణలో బోనాల పండుగా సందడి కనిపిస్తుంది. ఇవాళ ఉదంయ సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

తెలంగాణలో బోనాల పండుగా సందడి కనిపిస్తుంది. ఇవాళ ఉదంయ సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకార్ సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘనం స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

ఈ నేపథ్యంలో నేడు, రేపు సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆలయానికి 2 కిలో మీట‌ర్ల ప‌రిధిలో ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయని తెలిపారు. అటు వైపుగా వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. బోనాల సందర్బంగా.. టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్ -బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వ‌ర‌కు -జ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్ – ఆద‌య్య ఎక్స్ రోడ్ రోడ్లు మూసివేశారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిట‌ల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా వాహనాలు మ‌ళ్లించ‌నున్నారు. సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను బేగంపేట నుంచి క్లాక్ ట‌వ‌ర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మ‌ళ్లించారు.

Suresh SSM