New Parliament : కొత్త పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ ప్రయోగించిన అగంతకులు

నూతన పార్లమెంటు లోక్‌ సభలో భద్రత వైఫల్యం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లు జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి పోపలికి దూసుకోచ్చారు. పొపలికి దూపుకొచ్చిన అగంతకులు సభలో టీయర్ గ్యాస్ ప్రయోగించారు.

నూతన పార్లమెంటు లోక్‌ సభలో భద్రత వైఫల్యం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లు జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి పోపలికి దూసుకోచ్చారు. పొపలికి దూపుకొచ్చిన అగంతకులు సభలో టీయర్ గ్యాస్ ప్రయోగించారు. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి టియర్ గ్యాస్ వదలడంతో పార్లమెంటు సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో పార్లమెంటు సభ్యులు భయంతో పరుగులు తీశారు. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యి.. ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.