ఐపీఎల్ 17వ సీజన్ (IPL 17 Season)లో యువక్రికెటర్లే (Young Cricketer) కాదు జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్స్ కూడా దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) విధ్వంసం సృష్టిస్తున్నాడు. వరుసగా మెరుపు ఇన్నింగ్స్‌లతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన హై స్కోరింగ్ ఆర్సీబీ (RCB) ఓడినప్పటకీ దినేష్ కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో కార్తీక్ ఒంటరి పోరాటం చేశాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు. అతడికి బౌలింగ్‌లో ఎలా చేయాలో ఆర్ధం కాక సన్‌రైజర్స్ బౌలర్లు తలలపట్టుకున్నారు.
భువనేశ్వర్ (Bhubaneswar), ప్యాట్ కమ్మిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ.. గట్టిపోటీ ఇవ్వగలిగింది. కాగా డికే ఈ ఏడాది సీజన్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు.. డీకే మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ముంబైతో మ్యాచ్ సమయంలోనూ డీకే డిఫరెంట్ షాట్స్‌తో అదరగొట్టేశాడు. అప్పుడు గ్రౌండ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఇదంతా వరల్డ్‌కప్‌లో ప్లేస్ కోసమేనా అంటూ డీకేను టీజ్ చేయడం కూడా వైరల్‌గా మారింది. అయితే కేవలం ఐపీఎల్ ప్రదర్శనతోనే ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది సీజన్‌లోనూ డీకే ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లతో టీ ట్వంటీ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు