Tollywood Directors: పాన్ ఇండియా పిచ్చి బాగా ముదిరింది భయ్యా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొందరు పాన్ ఇండియా సినిమా తీయాలని చూస్తుంటే.. మరి కొందరు టాలివుడ్ కే పరిమితం అయ్యారు. అసలు ఏంటి ఈ పరిస్థితి.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 03:00 PM IST

పేరు,ఊరు తెలీని డైరెక్టర్స్‌ పాన్‌ ఇండియా సినిమాలు తీస్తున్నారు. కాస్త క్రేజ్‌ వుంటే చాలు పాన్‌ ఇండియా డైరెక్టర్స్ అయిపోతున్నారు.అందరి లక్ష్యం పాన్‌ ఇండియా డైరెక్టర్‌ కావడమే. మరి టాలీవుడ్‌ క్రేజీ డైరెక్టర్స్‌ కొందరు అటుగా ఎందుకు ప్రయాణించడం లేదు? తెలుగు సరిహద్దులు దాటి ఎందుకు వెళ్లడం లేదు? వంశీ గతంలో ఏం సినిమాలు తీశారో గుర్తులేకపోయినా.. ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల డెబ్యూ మూవీ ‘దసరా’తో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయాడు. మూడు సినిమాల దర్శకుడు శివ నిర్వాణ ‘ఖుషీ’తో హిందీలోకి అడుగుపెట్టాడు. ఇలా అందరిచూపు పాన్‌ ఇండియాపైనే వున్నా.. స్టార్‌ డైరెక్టర్స్‌ అనిల్‌ రావిపూడి.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. బోయపాటి మాత్రం.. అటుగా అడుగులు వేయలేకపోతున్నారు.

రాజమౌళి తర్వాత తెలుగులో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా అనిల్‌ రావిపూడి పేరు తెచ్చుకున్నాడు. ఇంత సక్సెస్‌ బ్రాక్‌డ్రాప్‌ వున్నా.. పాన్‌ ఇండియాపై ఈ డైరెక్టర్‌ కన్ను పడకపోవడం విశేషం. భగవంత్‌ కేసరి తర్వాత నెక్ట్స్‌ మూవీ ఇంకా ఎనౌన్స్‌ చేయకపోయినా.. చిరంజీవి కోసం కథ రాసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. మరి మెగాస్టార్‌తో అయినా.. పాన్‌ ఇండియాలోకి అడుగుపెడతాడా? లేదంటే.. ఓన్లీ టాలీవుడ్ అంటూ తెలుగు సినిమాలు మాత్రమే తీస్తాడో చూడాలి.

స్కంద సినిమాతో బోయపాటి పాన్‌ ఇండియాలోకి అడుగుపెడుతున్నాడనుకుంటే.. కుదర్లేదు. స్కంద సౌత్‌లోని అన్ని లాంగ్వేజెస్‌తోపాటు.. హిందీలో రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు. దీనికి తగ్గట్టే అన్ని భాషల్లో ట్రైలర్స్‌, సాంగ్స్‌ రిలీజ్‌ చేశారు. మరి హీరో,డైరెక్టర్‌, ప్రొడ్యూసర్ మధ్య ఏమైందోగానీ.. ప్రమోషన్‌ చేయలేదు. స్కంద పాన్‌ ఇండియాగా రిలీజైన సంగతే తెలీకుండా వచ్చి వెళ్లిపోయింది. స్కంద కంటే ముందే.. అఖండను హిందీ డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే పట్టించుకోలేదు. ఈ లెక్కన బోయపాటి అఖండ2 పాన్‌ ఇండియా మూవీగా తీస్తాడో లేదో చూడాలి మరి.

అల వైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్‌ నాన్‌ బాహుబలి రికార్డ్‌ను సెట్ చేశాడు. అదిరిపోయే రికార్డ్‌ సొంతం చేసుకున్నా.. త్రివిక్రమ్‌ పాన్‌ ఇండియా విషయంలో మాత్రం వెనుకపడిపోయాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో మెప్పించే త్రివిక్రమ్ పాన్‌ ఇండియాకు ఎందుకు దూరంగా వుంటున్నాడో అర్థం కావడం లేదు. త్రివిక్రమ్‌ మహేశ్‌తో తీస్తున్న గుంటూరుకారం తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్‌లో రిలీజ్‌ కావడం లేదు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్‌ చేస్తే అదే చాలనుకుంటున్నారు. హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్‌ చేయాలన్న ఆలోచనే లేదు.

త్రివిక్రమ్‌ గుంటూరు కారం తర్వాత బన్నీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్‌ ఇండియా జోలికి వెళ్లకపోయినా.. బన్నీ సినిమాతో పాన్‌ ఇండియా తప్ప మరో ఆప్షన్‌ గురూజీకి లేదు. పుష్పతో పాన్‌ ఇండియా హీరో అయిపోయిన స్టైలిష్‌ స్టార్‌ను తెలుగు వరకే పరిమితం చేయలేడు. బన్నీ సినిమాతో పాన్‌ ఇండియా కథ రాసుకోవాల్సిందే. బృందావనం.. ఊపిరి.. మహర్షి వంటి హిట్స్‌తో వంశీ పైడిపల్లికి ఎంత క్రేజ్ వచ్చినా.. తెలుగు, తమిళంకే పరిమితమవుతున్నాడు. నాగార్జున, కార్తీతో తీసిన ఊపిరి.. విజయ్‌ ‘వారసుడు’ను తెలుగు, తమిళంలో రిలీజ్‌ చేశాడు. ఇంకా ఎనౌన్స్‌ చేయకపోయినా.. నెక్ట్స్‌ మూవీతో అయినా.. పాన్‌ ఇండియాలోకి అడుగుపెడతాడేమో చూడాలి మరి.