గుజరాత్ గడ్డపై హైదరాబాద్ పోలీసుల సెన్సేషనల్ ఆపరేషన్…!

తాజాగా సైబర్ క్రైమ్ లో భారీ అరెస్టులు జరిగాయి. ఇండియా మొత్తంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.

  • Written By:
  • Publish Date - August 24, 2024 / 12:18 PM IST

గత కొన్నాళ్ళుగా హైదరాబాద్ పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నేరాలకు పాల్పడిన వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదు అనే సంకేతాలను ఇస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ లో భారీ అరెస్టులు జరిగాయి. ఇండియా మొత్తంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. గుజరాత్ లో స్పెషల్ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 36 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అందులో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక చార్టెడ్ అకౌంట్ ను అరెస్ట్ చేసారు. 11 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 4 ట్రేడింగ్ ఫ్రాడ్స్, ,4 ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ ..నాలుగు కేవైసీ ఫ్రాడ్స్ నిందితులు ఉన్నారు ఈ లిస్టు లో. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో డ్రగ్స్ సహా పలు వ్యవహారాల మీద దృష్టి పెట్టిన పోలీసులు స్వయంగా గుజరాత్ వెళ్లి ఒక ఆపరేషన్ నిర్వహించడం మాత్రం సంచలనం అయింది.