TAPPING REMAND REPORT : ట్యాపింగ్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు…

ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంలో BRS నేతలు, పోలీసు అధికారుల లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో వందల మంది అపోజిషన్ లీడర్ల ఫోన్లతో పాటు వ్యాపారులు, రియల్టర్లు, సెలబ్రిటీలు, సమాజంలోని ప్రముఖ వ్యక్తులు... ఇలా ఎవర్నీ వదలలేదు.

ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంలో BRS నేతలు, పోలీసు అధికారుల లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో వందల మంది అపోజిషన్ లీడర్ల ఫోన్లతో పాటు వ్యాపారులు, రియల్టర్లు, సెలబ్రిటీలు, సమాజంలోని ప్రముఖ వ్యక్తులు… ఇలా ఎవర్నీ వదలలేదు. ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు వినడమే కాదు… బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా ఈ మాజీ పోలీస్ అధికారులపై ఆరోపణలున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్ రావు (Praneet Rao), భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. అరెస్టయిన ముగ్గురూ అప్పటి SIB చీఫ్ ప్రభాకర్ రావు (Chief Prabhakar Rao) చెబితేనే ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. వారం రోజులుగా ప్రణీత రావుని విచారించిన పంజాగుట్ట పోలీసులు కీలక విషయాలు రాబట్టారు.

ప్రభాకర్ రావుతో పాటు… భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఫోన్ నెంబర్లను టాప్ చేసినట్టు ప్రణీతరావు ఒప్పుకున్నాడు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. లీడర్ల కదలికలు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దృష్టి పెట్టినట్టు ప్రణీత్ రావు తెలిపాడు. పొలిటికల్ లీడర్లతో (political leaders) పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా టాప్ చేశారు. వ్యాపారవేత్తలు, సమాజంలో పేరున్న వారి ఫోన్లను కూడా టాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్టే… టాపింగ్ మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు తెలిపాడు. 17 కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేశారు. డిస్కులతో పాటు మెయిన్ డివైస్ ని కట్టర్ తో ముక్కలుగా కట్ చేసి… వాటిని మూసీ నదిలో పడవేశామన్నారు. SIB ఆఫీసులోని 2 లాగర్ రూముల్లో డాక్యుమెంట్లన్నీ తగలబెట్టినట్టు ప్రణీత రావు ఒప్పుకున్నాడు. BRS కీలక నేత ఇచ్చిన మొబైల్ నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్టు మరో పోలీస్ అధికారి భుజంగరావు ఒప్పుకున్నారు. ఆ నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకి పంపి… అక్కడి సమాచారాన్ని మళ్ళీ ఆ BRS నేతకు అందించినట్టు భుజంగరావు తెలిపారు.

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ ఆరుగురిని నిందితులుగా తేల్చారు పోలీసులు. ఇందులో అప్పటి SIB చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా చేర్చారు. BRS నేతలు చెప్పిన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించాడు. మొత్తం ఈ వ్యవస్థకు బాస్ ఈయనే. ఏ2 గా ప్రణీత్‌రావు… ఇతనే SIB ఆఫీసులో 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ…ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకి మిగతా అధికారులకు అందించాడు. ఇక ఏ3గా రాధాకిషన్, ఏ4గా భుజంగరావు, ఏ5 తిరుపతన్న… వీళ్ళు ముగ్గురు BRS కీలక నేతలతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు చేరవేయడం వీళ్ళ డ్యూటీ. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన కీలక సమాచారాన్ని… ఆ గులాబీ లీడర్లకు అందించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఏ6గా ఐన్యూస్ చానెల్ ఎండీ శ్రవణ్ రావు పేరును చేర్చారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావు చుట్టం. గులాబీ నేతలు, అప్పటి మంత్రులు ఎవరు ఏ మొబైల్ నంబర్ ఇస్తే దాన్ని అధికారులకు పంపి ట్యాపింగ్ చేయించేవాడు. అందుకోసం ఐన్యూస్ ఛానెల్ ఆఫీసులో ఏకంగా సర్వర్ నే పెట్టించాడు. అప్పట్లో ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్‌ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.