దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చార్ ధామ్ యాత్రకు వెళ్తున్న టూరిస్ట్ వాహనం అలకనంద నదిలో పడిపోయింది. దీంతో యాత్రికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఇక విషయంలోకి వెళితే.. దేవ భూమి ఉత్తరాఖండ్ లో ప్రతి సంవత్సరం ఆరు నెలలు మాత్రమే దర్శించదగ్గ చోట చార్ ధామ్ యాత్ర వెళ్తున్న యాత్రికులకు ఊహించని ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఓ టెంపో ట్రావెలర్ వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. దీంతో ఆ వాహనంలో ప్రయానిస్తున్న 12 మంది మృతి చెందగా.. మరో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో నలుగురు కన్నుమూశారు. మిగతా 12 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారికి రిషికేశ్ ఎయిమ్స్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా మొత్తం 26 మందిని యాత్రకు వాహనం వెళ్తున్నట్లు గుర్తించారు. రిషికేశ్-బద్రినాథ్ హైవేపై అలకనందా నది పక్క నుంచి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
యాత్రికులతో వెళ్తున్న టెంపో వాహనం 26 మందితో అలకనంద నదిలోకి 1500 అడుగుల పైనుంచి దొర్లుకుంటు నదిలోకి దుసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న యాత్రికులు నుజ్జునుజ్జు అయ్యారు. కాగా అందులో ఉన్నవారు దాదాపు ఢిల్లీకి చెందిన టూరిస్టులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మృతులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు పరమాత్ముడు తన పాదాల చెంత చోటు కల్పించాలని, మృతుల కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ను ప్రార్థిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ప్రధాని మోదీ రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందించాలని అధికారులను ఆదేశించారు.