దేశంలో ఏడు ప్రసిద్ధ విష్ణు ఆలయాలు – ఒక్కసారి దర్శిస్తే జన్మధన్యం

త్రిమూర్తుల్లో విష్ణువు ఒకరు. లోకరక్షకుడిగా ఆయన్ను పరిగణిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమహావిష్ణువును ముందుగా పూజిస్తారు. నారాయణుడి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో.. వారిని లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందని విశ్వాసం. విష్ణువు ఆరాధించే ధనుర్మాసంలో... దేశంలోని ఏడు ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - December 25, 2024 / 05:59 PM IST

త్రిమూర్తుల్లో విష్ణువు ఒకరు. లోకరక్షకుడిగా ఆయన్ను పరిగణిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమహావిష్ణువును ముందుగా పూజిస్తారు. నారాయణుడి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో.. వారిని లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందని విశ్వాసం. విష్ణువు ఆరాధించే ధనుర్మాసంలో… దేశంలోని ఏడు ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో విష్ణువు సర్వలోకైకనాథుడు. యజుర్వేదం, రుగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు… నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి. అలాంటి నారాయణుడిని కొలిచేందుకు… దేశంలో ఐదు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

దేశంలోని ఐదు ప్రసిద్ధ విష్ణు దేవాలయాల్లో ఒకటి… బద్రీనాథ్‌. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం చార్‌ధామ్‌లలో ఒకటి. ఈ చార్‌ధామ్ ఆలయంలో బద్రీ స్వామిని దర్శించుకున్న వారికి అన్ని తీర్థయాత్రలు దర్శించుకున్న ఫలితం లభిస్తుందట. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. అక్కడ… శ్రీ మహావిష్ణువు విగ్రహం శాలిగ్రామ రాతితో చేయబడింది. బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

రెండోది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల గిరిపై ఉంది. ఈ ఆలయం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తిరుమలలో కొలువైన విష్ణుమూర్తిని వెంకటేశ్వరస్వామి, మలయప్పస్వామి, బాలాజీ, గోవిందుడు అని పిలుస్తారు. ఇక్కడ విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది.. ఆశ్చర్యకరమైంది. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ చెమటతో స్నానం చేస్తూ ఉంటుందట. తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది.

మూడోది… పద్మనాభస్వామి ఆలయం. కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో దర్శనమిస్తుంది. ఈ ఆలయం దేశంలోని గొప్ప దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయ గర్భగుడిలోనే శ్రీహరి విగ్రహం లభించిందని.. ఆ విగ్రహాన్ని అక్కడే అదే స్థలంలో ప్రతిష్టించారట. ఆ ఆలయంలోకి వెళ్లే భక్తులు… సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.

నాలుగోది శ్రీరంగనాథస్వామి ఆలయం… తమిళనాడులోని ప్రసిద్ధ విష్ణు దేవాలయం. ద్రావిడ వాస్తుశిల్పంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 108 దివ్యదేశాలలో అత్యంత ప్రసిద్ధమైంది. తమిళ నెల మార్గాలిలో జరిగే 21 రోజుల ఉత్సవానికి… లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

ఐదోది పండరీపురం ఆలయం… మహారాష్ట్రలో ఉంది. పండరీపురం శ్రీ పాండురంగ విఠలస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు నడుముపై చేయి వేసుకునట్టుగా దర్శనమిస్తాడు. కన్నయ్యతో పాటు రుక్మిణి కూడా పూజలు అందుకుంటుంది. విఠల దర్శనం కోసం ఉత్పన్న ఏకాదశి రోజున భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. విఠల దర్శనార్ధం చేసే తీర్థయాత్రను వారి-వర్కరి అని పిలుస్తారు. భక్తుడైన పుండలుకుడి ఆజ్ఞలను అనుసరించి కృష్ణుడు తన నడుముపై చేయి వేసుకుని నిలబడ్డాడు. అప్పటి నుంచి నడుముపై చేయి వేసుకున్న విగ్రహానికి భక్తులు పూజలను చేస్తారు.

ఆరోది జగన్నాథ ఆలయం. ఇది ఒడిషాలోని ప్రసిద్ధ విష్ణు దేవాలయం. 11వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఏటా నిర్వహించే రథయాత్రకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.

ఏడోది.. ద్వారకాధీష్‌ ఆలయం.. గుజరాత్‌లోని ద్వారకలో ఉంది. ఉంది. ద్వారకాధీష్ అంటే ద్వారకా నగరానికి రాజు అని అర్థం. ఆలయ ప్రధాన మందిరాన్ని జగత్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించి 2వేల 500 ఏళ్లు అయ్యిందని అంచనా. విష్ణుభగవానుని 108 దివ్యప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి.