REV CASE UPDATE : రేవ్ పార్టీలో సెక్స్ రాకెట్.. ఎంట్రీ ఫీజు 2 లక్షలు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బెంగళూరు శివారుల్లో ఈ పార్టీ ఏర్పాటైంది.

 

 

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బెంగళూరు శివారుల్లో ఈ పార్టీ ఏర్పాటైంది. ఇందులో మొదట 100 మంది మాత్రమే పాల్గొన్నట్టు కర్ణాటక పోలీసులు తెలిపారు. కానీ మొత్తం 200 మంది దాకా ఉన్నట్టు లేటెస్ట్ ఎంక్వైరీలో బయటపడింది. ఎంట్రీ ఫీజు కింద ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయలను వసూలు చేశారు నిర్వాహకులు.

హైదరాబాద్ కు చెందిన వాసు బర్త్ డే పార్టీ అని చెప్పినా… లోపల మాత్రం రేవ్ పార్టీయే జరిగినట్టు చెబుతున్నారు. పాల్గొన్న వాళ్ళకు కూడా బర్త్ డే పార్టీ అని చెప్పమన్నారు నిర్వాహకులు. డ్రగ్స్ వాడకంతో పాటు నిర్వాహకులు సెక్స్ రాకెట్ ను కూడా నడిపించినట్టు బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి అన్ని సౌకర్యాలను నిర్వాహకులు కల్పించారని పోలీసులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం నుంచి మొదలైన పార్టీ ఆదివారం అర్థరాత్రి దాకా కొనసాగింది. శనివారం రాత్రి పార్టీలో పాల్గొన్న కొందరు ఆదివారం తెల్లవారుజామున పార్టీ నుంచి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళెవరూ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కలేదు.

ఈ పార్టీలో ఏపీ, తెలంగాణ నుంచి కొందరు టెకీలతో పాటు తెలుగు సినీ, సీరియల్ నటులు కూడా పాల్గొన్నారు. MDMA, కొకైన్, హైడ్రో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పోలీసులకు పట్టుబడ్డాయి. బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేను అంటూ నటి హేమ కలరింగ్ ఇస్తున్నా… పోలీసులు మాత్రం ఆమె అక్కడే ఉన్నట్టు ఆధారాలతో సహా బయటపెట్టారు. హేమ రిలీజ్ చేసిన వీడియో రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లోనిదే అని క్లియర్ గా బయటపడింది. అయితే ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నదనీ… హేమ డ్రగ్స్ తీసుకుందా లేదా అన్నది కన్ఫమ్ చేసుకోడానికి రక్త నమూనాలు కూడా సేకరించినట్టు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు.