టీమిండియాకు షాక్ తిరగబెట్టిన షమీ గాయం

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియాకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆసీస్ టూర్ లో ఆడడం అనుమానంగా మారింది. మోకాలి గాయం తిరగబెట్టడమే దీనికి కారణం.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 07:23 PM IST

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియాకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆసీస్ టూర్ లో ఆడడం అనుమానంగా మారింది. మోకాలి గాయం తిరగబెట్టడమే దీనికి కారణం. ప్రస్తుతం షమీ బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రతను చూస్తే కనీసం 6 నుంచి 8 వారాల విశ్రాంతి కావాలని చెబుతున్నట్టు సమాచారం. నిజానికి షమీ దేశవాళీ టోర్నీలో ఆడి.. ఫిట్‌నెస్ నిరూపించుకుంటాడని అంతా భావించారు. న్యూజిలాండ్ తో సిరీస్ తో రీఎంట్రీ ఇస్తాడని కూడా అంచనా వేశారు. ఇటువంటి పరిస్థితుల్లో షమీ గాయం మళ్ళీ తిరగబెట్టడం ఆందోళన కలిగిస్తోంది.

షమీ గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మళ్లీ భారత్ తరఫున ఆడలేదు. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ఎంపికైనా ఫిట్ నెస్ సాధించకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత చికిత్స తీసుకున్న షమీ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్నాడు. ఫిట్ నెస్ కూడా సాధించి బౌలింగ్ చేస్తుండడంతో ఆసీస్ తో టూర్ కు జట్టులోకి వస్తాడని బోర్డు వర్గాలు కూడా ధృవీకరించాయి. తాజాగా మోకాలి నొప్పి మళ్ళీ మొదలవడంతో బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. వర్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకారం అతడిపై ఎక్కువ భారం లేకుండా చూడాలని ఎన్సీఎ వైద్యులు సూచించారు. ఒకవేళ 6 నుంచి 8వారాలు బౌలింగ్ చేయకుంటే మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. భారత్ ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి మొదలవుతుంది.