అవన్నీ అవాస్తవాలే ఫిట్ గా ఉన్నానంటూ షమీ ట్వీట్

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మోకాలి గాయం మళ్ళీ తిరగబెట్టిందంటూ వార్తలు వచ్చాయి. షమీ ఆసీస్ తో సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని షమీ క్లారిటీ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 04:52 PM IST

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మోకాలి గాయం మళ్ళీ తిరగబెట్టిందంటూ వార్తలు వచ్చాయి. షమీ ఆసీస్ తో సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని షమీ క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఈ వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరాధారమైన వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మీడియాపై మండిపడ్డాడు. ప్రస్తుతం కోలుకోవడానికి కష్టపడి శ్రమిస్తున్నాననీ ట్వీట్ చేశాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐగానీ, తానుగానీ ఏం చెప్పలేదన్నాడు. ఇలాంటి ఆధారాల్లేని వార్తలను పట్టించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అలాగే ఇలాంటి పుకార్లను, ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయకండి అంటూ మీడియాను కూడా కోరాడు.

పెయిన్ కిల్లర్స్ వాడుతూ వన్డే ప్రపంచకప్ ఆడిన షమి తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచీ గ్రౌండ్ లో అడుగుపెట్టని షమీ ప్రస్తుతం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఎన్సీఎ మెడికల్ టీమ్, కోచ్ ల సమక్షంలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. కివీస్ తో సిరీస్ కోసం షమీ ఎంపికవుతాడని భావిస్తున్నా అతని పూర్తి ఫిట్ నెస్ సాధించడంపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.