మీ అతితెలివిని మిగుల్చుకోండి, మంజ్రేకర్ కు షమీ కౌంటర్

టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలోనూ మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్న షమీపై బీసీసీఐ సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 21, 2024 / 06:21 PM IST

టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలోనూ మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్న షమీపై బీసీసీఐ సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం హడావుడి పడకుండా వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. త్వరలో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ షమీ ఆడే అవకాశముంది. ఆ తర్వాత ఆసీస్ టూర్ కు బీసీసీఐ అతన్ని పంపించే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఐపీఎల్ రిటెన్షన్ లో షమీకి చోటు దక్కలేదు. గుజరాత్ టైటాన్స్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. దీంతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షమీపై కొన్ని కామెంట్స్ చేశాడు.

షమీ ఈ మధ్య తరుచుగా గాయపడుతున్నాడనీ, ఈ కారణంగానే అతన్ని రిటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైజీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాయన్నాడు. పూర్తిగా అందుబాటులో ఉండే ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు ఎంతైనా ఖర్చు పెడతాయనీ, కానీ సీజన్ మధ్యలో గాయపడి, టీమ్‌కి దూరమయ్యే షమీ లాంటి ప్లేయర్లకు పెద్దగా డిమాండ్ ఉండదన్నాడు. త్వరలో జరిగే వేలంలోనూ షమీకి భారీ ధర పలకదంటూ వెటకారం చేశాడు. అయితే సంజయ్ మంజ్రేకర్ కు భారత సీనియర్ మహ్మద్ షమీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. తనపై చేసిన కామెంట్స్ కు గట్టిగానే రియాక్టయిన షమీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

బాబా జీ కి జయహో… సంజయ్ జీ.. మీ ఫ్యూచర్ కోసం కూడా కొంత జ్ఞానాన్ని దాచి పెట్టుకోండి అంటూ సెటైర్లు వేశాడు. వరికైనా మీ జ్ఞానం అవసరమైతే వచ్చి, మిమ్మల్ని కలుస్తారనీ, అప్పటికి మీ బుర్రలో కొంతైనా మిగిలి ఉండాలి కదా అంటూ ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.ఐపీఎల్ 2022 మెగా వేలంలో మహ్మద్ షమీని 6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ, 2023 సీజన్‌లో పర్పుల్ క్యాప్ కూడా గెలిచాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో 28 వికెట్లతో టాప్‌వికెట్ టేకర్ గా నిలిచిన షమీ, గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ ఆడలేదు.