టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ పొట్టి క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. టీ ట్వంటీ క్రికెట్ లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య 201కి చేరింది. కాగా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ తొలి స్థానంలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో చాహల్ 364 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడుతుండగా… అతన్ని ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి పంపడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.