SHARMILA YSR TP: షర్మిలమ్మా… మీ పార్టీ ఉందా ? బీఆర్ఎస్ లో విలీనం అయిందా ?

తెలంగాణలో వైఎస్సార్ టీపీ ఉన్నట్టా... లేన్నట్టా... అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించాక... ఆ పార్టీలో చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి నేతల దాకా అందరూ రిజైన్ చేశారు. చివరకు గులాబీ కండువాలు కప్పుకున్నారు. మంత్రి హరీష్ రావు మాత్రం... వైఎస్సార్ టీపీని విలీనం చేయడానికి వచ్చిన లీడర్లకు స్వాగతం అనడం ... ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

  • Written By:
  • Updated On - November 13, 2023 / 07:53 PM IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా YSRTP అధినేత షర్మిల అస్త్ర సన్యాసం చేయడంతో ఇప్పుడు ఆ పార్టీలో ఆమె తప్ప ఎవరూ మిగలలేదు అనిపిస్తోంది. గట్టు రామచంద్రరావుతోపాటు దాదాపు లీడర్లంతా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. పైగా YSRTP ని విలీనం చేయడానికి వచ్చిన నేతలందరికీ స్వాగతం అంటూ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అసలు తెలంగాణలో YSR TP ఉందా… లేదా…ఉంటే షర్మిల ఒక్కతే ఉన్నారా… అన్న అనుమానాలు వస్తున్నాయి.

YSR TP ని కాంగ్రెస్ లో విలీనం చేసి పాలేరులో నిలబడదాం…… కాంగ్రెస్, తన తండ్రి వైఎస్సార్ పేరు చెప్పుకొని ఆ ఒక్క సీటైనా గెలుచుకుందాం అని ప్లానేశారు షర్మిల. కానీ పార్టీ విలీనానికి … రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారు. ఆశలు పెట్టుకున్న పాలేరు స్థానంలో తమ కుటుంబానికి ఆప్తుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలబడటంతో.. టోటల్ గా షర్మిల ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. దాంతో కేసీఆర్ ను ఓడించడానికి… కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని … ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు. షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ లీడర్లు… ఆమె నిరంకుశంగా వ్యవహరించారంటూ శాపనార్థాలు పెట్టారు. చివరకు మంత్రి రీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. YSR TP రాష్ట్ర స్థాయి లీడర్లు, అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు భారీగా కారు ఎక్కారు. వైఎస్సార్ టీపీని విలీనం చేయడానికి వచ్చిన లీడర్లందరికీ స్వాగతం అని హరీష్ రావు కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. తండ్రి సమానులైన కేసీఆర్ ను రాజకీయం తిట్టి… ఇవాళ రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అని మండిపడ్డారు హరీష్ రావు.
వైఎస్సార్ టీపీ BRS లో విలీనం అయినట్టు బాహాటంగానే చెప్పారు హరీష్. దీన్ని షర్మిల ఒప్పుకుంటుందా ? ఆమె ఏం సమాధానం చెబుతుంది…పార్టీలో స్టేట్ లీడర్లు వెళ్ళిపోయారు… జిల్లాల కోఆర్డినేటర్లు… కార్యకర్తలు అంతా గులాబీ పార్టీలో చేరిపోయారు. ఒంటరి అయిన షర్మిల YSR TPని నడుపుతారా ? లేక చేతులెత్తేస్తారా అన్నది చూడాలి.