A Medical Issue: 11 ఏళ్ళ ప్రాయంలో తండ్రిగా మారిన బాలుడు.. ఎక్కడో తెలుసా..?

అతి చిన్న వయసులోనే డాక్టర్, పోలీస్, లాయర్, సైంటిస్ట్, ఆర్మీ ఆఫీసర్, ఐపీఎస్, ఐఏఎప్ వంటి గొప్ప గొప్ప పదవులు అధిరోహించడం చూస్తూ ఉంటాం. దీనికి గల కారణం వారు చిన్న వయసులోనే తీవ్రమైన జబ్బుకు గురై కొన్ని రోజుల్లోనే తనువు చాలిస్తారన్న విషయం తెలుసుకొని వారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. గతంలో హైదరాబాద్ నగర కమిషనర్ గా ఒక బాలుడు చార్జ్ తీసుకోవడం చూసే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చేపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక 11 సంవత్సరాల బాలుడు ఎవరి ప్రమేయం లేకుండా తండ్రి గా మారడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి వైద్యశాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - July 9, 2023 / 08:48 PM IST

తండ్రి అవడం కొందరికి ఒక కల. పిల్లలతో ఆడుకోవడం అదో రకమైన అనుభూతి. ఇది వయసును బట్టి, స్థాయిని బట్టి ఉంటే బాగుంటుంది. అదే అతి చిన్న వయసులో అక్షర జ్ఞానం కూడా సరిగా లేని ప్రాయంలో తండ్రిగా మారితే అది కాస్త సమస్యగానే పరిగణించాలి. సమాజం కూడా దీనిని స్వాగతించదు. అయితే మగ పిల్లాడు కేవలం 11 సంవత్సరాలకే తండ్రి కాగల శక్తిని సామర్ధ్యాలు ఉంటాయని బ్రిటన్ కి చెందిన షాన్ స్టీవర్ట్ రుజువు చేశాడు. ఈ ఘటన చూసి అక్కడి శాస్త్రవేత్తలు సైతం నోరెళ్లబెట్టారంటే అతిశయోక్తికాదు. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కొందరు మగ పిల్లాడు ఏ వయసులో తండ్రి అవుతాడనే దానిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో ఈ వింతైన పరిణామం చోటు చేసుకోవడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దీని గురించి మరిన్ని పూర్తి వివరాలను శాస్త్రోత్తకంగా తెలుసుకుందాం.

సైన్స్ ఏమంటుందంటే..

విజ్ఞాన శాస్త్రం కొన్ని అంశాలను పరిగిణలోకి తీసుకొని మగ పిల్లవాళ్ల తండ్రి వయసును నిర్ధారించింది. 11 నుంచి 14 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లవాడు తండ్రి అయ్యేందుకు సంపూర్ణంగా అర్హుడు అవుతాడని శాస్త్రం చెబుతుంది. దీనికి కారణం అతనిలో జరిగే కొన్ని హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ అని పేర్కొంది. 11 వ ఏట అడుగు పెట్టే సమయానికి మగ పిల్లవాళ్లలో వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయని ఈ సమయంలో మహిళతో కలిస్తే తప్పకుండా ఆమె గర్భవతి అవుతుందని సైన్స్ తెలుపింది.అయితే ఇది ప్రతిసారి సాధ్యపడదు. స్త్రీ రుతుచక్రం మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ ఇంత స్పష్టంగా వివరించినప్పటికీ సాధారణంగా అబ్బాయి 14 ఏళ్ల తరువాతే తండ్రి అయిన దాఖలాలు అధికంగా కనిపిస్తున్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకూ మనం పురుష ప్రత్యుత్పత్తి విధానాన్ని గురించి తెలుసుకున్నాం. అదే స్త్రీలలో ఏవిధంగా ఉంటుందో దీనిపై శాస్త్రం ఏమంటుందో ఇప్పుడు గమనిద్దాం.

స్త్రీ తల్లిగా మారేది అప్పుడే..

వైద్య శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయి అయినా 13 సంవత్సరాల వయసు తరువాతే గర్భం దాల్చేందుకు ఆవకాశం ఉంటుంది. దీనికి తగిన శక్తి, సామర్థ్యాలు ఆమెలో మెండుగా ఉంటాయి. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల్లో 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే మాతృమూర్తిగా మారేందుకు అవకాశం ఉంటుందని విజ్ఞన శాస్త్రంలోని కొన్ని అంశాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో మెడిసిన్ నెట్ అనే మాధ్యమ వేదికలో డాక్టర్ మోలిసా ఒక ఇంటర్వూను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని సార్లు అబ్బాయిల కన్నా అమ్మాయిలే త్వరగా తల్లిగా మారే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా గర్భందాల్చడం వల్ల శరీరంలోని వివిధ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య శాస్త్రం తెలుపుతోంది. కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా పుట్టిన బిడ్డల్లో కూడా అనేక జన్యుపరమైన సమస్యలు ఏర్పడుతాయి. నిజానికి పరిపూర్ణ ఆరోగ్యవంతమైన గర్భంతో శిశువును జన్మనిచ్చేందుకు సరైన వయసు 18గా నిర్థారించింది శాస్త్రం. దీనిని బట్టే మన దేశ చట్టాలు కూడా లిఖించారు. ఇందులో భాగంగానే పురుషుడికి, స్త్రీకి 18 సంవత్సరాలు నిండిన తరువాతే పెళ్లికి, బిడ్డకు జన్మనిచ్చేందుకు అర్హతను ఇచ్చినట్లు తెలుస్తుంది. మన దేశంలోపాటూ వివిధ దేశాల్లోనూ ఈ రకమైన చట్టాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా బ్రిటన్ లో షాన్ స్టీవర్ట్ కేవలం అతి పిన్న వయసులో అంటే 11 ఏళ్లకే తండ్రి కావడంతో శాస్త్రం సమాజంలో అవగాహన కల్పించేందుకు ఈ కీలక అంశాలను పరిశీలించి వెల్లడించింది.

T.V.SRIKAR