ప్రపంచ ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరా హోరీగా మ్యాచ్ సాగుతోంది. దేశ వ్యాప్తంగా 140 కోట్ల ప్రజలు టీవీలకు అత్తుకోని ఈ మ్యాచ్ పై ఆశలు పెట్టుకున్నారు.. 12 సంవత్సరాలుగు ఊరిస్తున్న వరల్డ్ కప్ నేడు మన చెంతకు వస్తుంది అనే అశభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ రసవంతంగా జరగుతున్న నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు.
Kohli Record : మరో రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ..
ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ ఒక మ్యాచ్ లాగా కాకుండా.. బీజేపీ సంబంధించిన ఈవెంట్ లా సాగుతోందని అంటూ క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ . “ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు” అని వ్యంగంగా విమర్శించారు సంజయ్ రౌత్.
ICC WORLD CRICKET CUP: విరాట్ కోహ్లీ ఔట్… బరువెక్కిన అభిమానుల హృదయాలు !
నిజానికి “క్రికెట్‌లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ నేడు ఐసీసీ వరల్డ్ కప్ జరుగుతున్న.. అహ్మదాబాద్‌లో అదే జరుగుతోంది” అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదు అంటూ చెప్పుకోచ్చారు. ఈ మ్యాచ్ కు భారత్ ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్ కచ్చితంగా కప్ గెలవాలి అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించనున్నట్లు వచ్చారు.