Shiva Parvati’s marriage : శివ పార్వతుల పెళ్లి జరిగింది ఇక్కడే.. ఆలయ ఎక్కడో తెలుసా..?

ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరాన హిమాలయ పర్వతాలలో ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ్ అనే స్థలంలో ఆ ఆలయం ఉంది. ఈ ప్రదేశంలో ప్రధానంగా విష్ణువు, శివుడు, పార్వతి ఉంటారు. కేధార్ నాథ్ ఆలయం (KedarNath Temple) మార్గంలో ఈ ఆలయం ఉంటుంది.

 

త్రియుగి నారాయణ్ ఆలయం..
ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరాన హిమాలయ పర్వతాలలో ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ్ అనే స్థలంలో ఆ ఆలయం ఉంది. ఈ ప్రదేశంలో ప్రధానంగా విష్ణువు, శివుడు, పార్వతి ఉంటారు. కేధార్ నాథ్ ఆలయం (KedarNath Temple) మార్గంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం రాంపూర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రియుగి అనే చిన్న గ్రామంలో త్రియుగి నారాయణ్ ఆలయం ఉంటుంది.

ఈ ఆలయం ప్రత్యేకత..

ఈ ఆలయంలో పూర్వం సాక్ష్యాత్తు ఆ పార్వతి పరమేశ్వరులు త్రియుగి నారాయణ్ (Triyugi Narayan) పుణ్య క్షేత్రంలో పార్వతిని ఆ పరమేశ్వరుడు వివాహ చేసుకున్నట్లు ఈక్కడి స్థల పూరణం చెబుతుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. శివపార్వతుల వివాహ సమయంలో ఇక్కడ వెలిగించిన హోమ గుండం అది సుమారుగా మూడు యుగాల నుండి అఖండ జోతిలా వెలుగుతూనే ఉంది. మూడు యుగాలుగు ఒక్క సారి కూడా ఆ హోమగుండం అరిపోలేదు. దేశంలో చాలా ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చి వివాహాలు చేసుకుంటారు. ఇక్కడ వివాహం చేసుకుంటే సాక్ష్యాత్తు ఆ శివపార్వతుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు.. వారి ఆశీర్వాదాలను పొందుతారని ఈ ఆలయ అధికారులు చెబుతారు. మరొకటి అక్కడ తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే.. వారు జీవితాంతం కలిసి ఉంటారని…వచ్చే జన్మలో కూడా వారే మళ్లీ భార్య భర్తలు జీవితాంతం కలిసి ఉంటారని ఈ గ్రామ ప్రజలు విశ్వసిస్తున్నారు.

ఇక శివపార్వతుల పెళ్లికి సాక్ష్యాత్తు ఆ నారాయణుడే సాక్ష్యంగా ఉన్నట్లుగా.. అందుకే ఈ ఆలయానికి త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చింది.

ఆలయ నిర్మాణం..

ఈ ఆలయం నాలుగు మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పు మాత్రం ఉండి.. ప్రధాన గర్భగుడిలో మధ్యలో నేలమీద నుండి కొద్దిగా ఎత్తులో ఒక రాతి పలక పానవట్టం లాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంటుందా. సత్య యుగం లో శివ పార్వతుల వివాహం ఈ పీఠం మీదనే జరిగింది అని స్థలపురాణం చేప్తుంది. ఈ ఆలయం బయట ప్రాంగణంలో 3 కుండములు వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. వీటిని బ్రహ్మ కుండము, విష్ణు కుడము, సరస్వతీ కుండము అని అంటారు.

త్రియుగి నారాయణ్ ఆలయ ప్రయాణం..

దేశంలో ఎక్కడ ఉన్న వారైనా మొదటగా.. విమాన మార్గం ద్వారా గానీ.. రైలు మార్గం ద్వారా గానీ.. రోడ్డు మార్గం ద్వారా గానీ ఢిల్లీ చేరుకోవాలి.. అక్కడి నుంచి రైలు ద్వారా.. రోడ్డు ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్, రిషికేష్ నగరంకు చేరుకోవాలి. రిషికేష్ నుంచి కేధార్ నాథ్, బద్రినాథ్ ఘాట్ రోడ్డు మార్గంలో రుద్రప్రయాగ్ అనే జిల్లాకు చేరుకోవాలి. అక్కడి నుంచి కేధార్ నాథ్ నుంచి వచ్చే మంధాకిని నదిని అనుసరిస్తు.. వెళ్లాలి.