శోభిత కూడా ఒక మహిళ వాణీ

ఫిల్మ్ జర్నలిస్ట్, ఇతర ఫిల్మ్ అసోసియేషన్స్ వీణావాణి, వేణు స్వామి ల ఆరోపణలపై స్పందించాయి. ఫిల్మ్, డిజిటల్, ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లు.. విమెన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాము అన్నారు ఫీల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్ సెక్రటరి రాంబాబు.

  • Written By:
  • Publish Date - August 20, 2024 / 05:41 PM IST

ఫిల్మ్ జర్నలిస్ట్, ఇతర ఫిల్మ్ అసోసియేషన్స్ వీణావాణి, వేణు స్వామి ల ఆరోపణలపై స్పందించాయి. ఫిల్మ్, డిజిటల్, ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లు.. విమెన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాము అన్నారు ఫీల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్ సెక్రటరి రాంబాబు. కమిషన్ నోటీసులు జారీ చేసింది అని తెలిపారు. ఎక్కడా బయట మీడియా ముందు మాట్లాడలేదు.. కంప్లైంట్ మాత్రమే ఇచ్చాము అన్నారు. నిన్న వేణుస్వామి, వీణ వాణి లు… వారికి థ్రెట్ ఉందని, 5 కోట్లు అడిగామని వీడియో రిలీజ్ చేశారు అని వాళ్ల తప్పును వాళ్లు గుర్తించడం లేదు అని మండిపడ్డారు.

వీణ వాణి గారు.. అవతల శోభిత కూడా ఒక మహిళా అని గుర్తించడం లేదు అని అసహనం వ్యక్తం చేసారు. శోభిత, నాగ చైతన్య బయటికి రాలేక కాదు.. వాళ్లు వస్తే మీడియా లో మరో వార్త అందుకే రాలేదు వాళ్లు అని అన్నారు. సుమోటోగా తీసుకుని… కంప్లైంట్ ఇచ్చమే గానీ.. అక్కినేని లేదా శోభిత ఫ్యామిలీ మమ్మలని అడగలేదు అని తెలిపారు. వేణు స్వామి వీడియో లో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా తెలీదు అని ఆయన వ్యాఖ్యానించారు. పిఎస్ లో కంప్లైంట్ చేశామన్నారు. సైబర్ సెల్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అని తెలిపారు.