రోహిత్, కోహ్లీ జట్లకు షాక్, ఫీల్డింగ్ లో ధృవ్ టీమ్ గెలుపు

క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఒక్క రనౌట్, ఒక్క క్యాచ్ , ఒక్క సింగిల్ మ్యాచ్ ను మలుపు తిప్పేస్తాయి... గెలుస్తుందనుకున్న టీమ్ ఓడిపోవడం.. ఓడిపోయే టీమ్ గెలిచే పరిస్థితులు అద్భుతమైన ఫీల్డింగ్ తోనే జరుగుతుంటాయి

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 01:01 PM IST

క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఒక్క రనౌట్, ఒక్క క్యాచ్ , ఒక్క సింగిల్ మ్యాచ్ ను మలుపు తిప్పేస్తాయి… గెలుస్తుందనుకున్న టీమ్ ఓడిపోవడం.. ఓడిపోయే టీమ్ గెలిచే పరిస్థితులు అద్భుతమైన ఫీల్డింగ్ తోనే జరుగుతుంటాయి. అందుకు ప్రతీ టీమ్ కూడా ఫీల్డింగ్ పై స్పెషల్ ఫోకస్ పెడతాయి. భారత జట్టు కూడా ఫీల్డింగ్ విషయంలో గత కొంతకాలంగా తనదైన ముద్ర వేస్తోంది. అద్భుతమైన ఫీల్డింగ్ తో అన్ని ఫార్మాట్ లలో సత్తా చాటుతోంది. దీని వెనుక టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ కృషి ఎంతో ఉంది. తాజాగా టీమిండియాను మూడు జట్లుగా డివైడ్ చేసి ఫీల్డింగ్ డ్రిల్స్ లో పోటీ నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ పోటీలో మూడు గ్రూప్స్ కు యువ క్రికెటర్లే కెప్టెన్లుగా వ్యవహరించారు. గ్రూప్ 1 టీమ్ కు సర్ఫరాజ్ ఖాన్ సారథిగా ఉంటే… కోహ్లీ, పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు. గ్రూప్ 2లో కెప్టెన్ గా సిరాజ్ , సభ్యులుగా రోహిత్ శర్మ, రాహుల్, పంత్ , ఆకాశ్ దీప్ , నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక గ్రూప్ 3కి ధృవ్ జురెల్ సారథిగా వ్యవహరిస్తే…బూమ్రా , జడేజా , గిల్ , ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ మెంబర్స్ గా ఉన్నారు. వికెట్ ను డైరెక్ట్ త్రోతో కొట్టడం, మెరుపుల్లాంటి క్యాచ్ లు అందుకోవడం ద్వారా పాయింట్లు ఇచ్చారు. ఈ పోటీలో కోహ్లీ, రోహిత్ టీమ్స్ ను వెనక్కి నెట్టిన ధృవ్ జురెల్ టీమ్ విజేతగా నిలిచి 300 డాలర్ల ప్రైజ్ మనీ అందుకుంది. యువ, సీనియర్ ఆటగాళ్ళ మధ్య ఈ కాంపిటేషన్ అద్భుతంగా జరిగిందంటూ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ చెబుతున్నాడు.