స్టార్ క్రికెటర్ కు షాక్, కోహ్లీ రెస్టారెంట్ కు నోటీసులు

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ బిజినెస్ లు నడపడంలోనూ బిజీగానే ఉన్నాడు. ఇప్పటికే పలు నగరాల్లో రెస్టారెంట్లు కూడా ఓపెన్ చేశాడు. అయితే తాజాగా బెంగళూరులో కోహ్లీకి చెందిన One8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌కు స్థానిక మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 12:10 PM IST

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ బిజినెస్ లు నడపడంలోనూ బిజీగానే ఉన్నాడు. ఇప్పటికే పలు నగరాల్లో రెస్టారెంట్లు కూడా ఓపెన్ చేశాడు. అయితే తాజాగా బెంగళూరులో కోహ్లీకి చెందిన One8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌కు స్థానిక మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ఫైర్‌ సేఫ్టీ విషయంలో నిబంధనలు పాటించడం లేదంటూ బెంగళూరు మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. సదరుశాఖ నుంచి NOC తీసుకోకుండా అలానే నడుపుతుండడంపై ఈ నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు 7 రోజుల గడువు ఇచ్చారు. స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది జూలైలో ఇదే రెస్టారెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.