ఆ ప్లేయర్స్ కు షాక్, వేలంలో అన్ సోల్డ్ వీరే

ఐపీఎల్ మెగావేలంలో రెండోరోజు పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఆచితూచి వ్యవహరించిన ఫ్రాంచైజీలు వెటరన్ ప్లేయర్స్ ను పట్టించుకోలేదు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆ దేశానికే చెందిన గ్లెన్ ఫిలిప్స్ అమ్ముడవలేదు.

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 09:00 PM IST

ఐపీఎల్ మెగావేలంలో రెండోరోజు పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఆచితూచి వ్యవహరించిన ఫ్రాంచైజీలు వెటరన్ ప్లేయర్స్ ను పట్టించుకోలేదు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆ దేశానికే చెందిన గ్లెన్ ఫిలిప్స్ అమ్ముడవలేదు. 2022 వేలంలో విలియమ్సన్ 14 కోట్లకు అమ్ముడవగా.. ఈ సారి 2 కోట్ల బేస్ ప్రైస్ కు కూడా ఎవ్వరూ తీసుకోలేదు. అలాగే భారత ఆటగాళ్ళు శార్థూల్ ఠాకూర్, అజంక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ లకు వేలంలో నిరాశే మిగిలింది. వారిని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిచూపలేదు. మెగావేలం కావడంతో ఆటగాళ్ళ వయసు, ఫిట్ నెస్, ఫామ్ ప్రకారమే ఫ్రాంచైజీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న ఆటగాళ్ళను కొనేందుకు సిద్ధంగా లేవు.