వరల్డ్ బాక్సింగ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మైక్ టైసన్..ఎన్నో ఏళ్ల పాటు తన పంచ్ పవర్ తో బాక్సింగ్ ను శాసించాడు. రింగ్ లో టైసన్ ఉన్నాడంటే ప్రత్యర్థి ఓటమి ముందే డిసైడ్ అయినట్టే…ఇలాంటి దిగ్గజ బాక్సర్ తన ప్రాభవాన్ని కోల్పోయి ఆటకు దూరమయ్యాడు.ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్‌తో తలపడడానికి అంగీకరించి బరిలోకి దిగాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన
మైక్ టైసన్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. 27 ఏళ్ల బాక్సర్ యూట్యూబర్ జేక్ పాల్ చేతిలో అతను పరాజయం పాలయ్యాడు. టెక్సాస్ వేదికగా ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరులో జేక్ పాల్ 78-74 తేడాతో టైసన్‌పై విజయం సాధించాడు.
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లోకి అడుగుపెట్టిన టైసన్ మునుపటి ఉత్సాహం చూపించలేకపోయాడు. మొదటి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, చివరివరకూ దానిని కొనసాగించలేకపోయాడు. మూడో రౌండ్ నుంచి జేక్ పాల్ పంచులు వర్షం కురిపించాడు. పాల్ ఓవర్‌హ్యాండ్ పంచ్‌లతో టైసన్ స్టామినా దెబ్బతినడంతో, అతని ముందు నిలబడలేకపోయాడు. చివరకు ఎనిమిదో రౌండ్‌లో ఓటమిని అంగీకరించాడు. 2005లో టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ బౌట్‌లో తలపడటం కోసం మరోసారి రింగ్‌లో అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ బౌట్ లో గెలిచిన పాల్ అక్షరాలా 338 కోట్లు అందుకున్నాడు. అలాగే టైసన్‌కు సుమారు168 కోట్ల మొత్తం అందినట్లు తెలుస్తోంది. ఓటమి అనంతరం టైసన్.. తన ప్రత్యర్థి జేక్ పాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. పాల్ నిష్ణాతుడైన పోరాట యోధుడని కొనియాడాడు.అయితే వెయిటేజ్ ఈవెంట్‌లో జరిగిన సంఘటనతో ఈ పోరుపై మరింత ఆసక్తి పెరిగింది. ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ జరగ్గా.. మైక్‌టైసన్ తన ప్రత్యర్థి అయిన జేక్ పౌల్ చెంప చెల్లమనిపించాడు