Pushpa2 : ఆ రికార్డ్స్‌పై పుష్ప‌-2 చూపు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ మూవీ కోసం ఇండియా వైడ్ బ‌న్నీ ల‌వ‌ర్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

 

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ మూవీ కోసం ఇండియా వైడ్ బ‌న్నీ ల‌వ‌ర్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్‌-1 కు ముందు వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన స్టైలిష్ స్టార్.. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించాడు. త‌న స్టైల్‌, స్వాగ్‌, మేన‌రిజ‌మ్‌ల‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు బ‌న్నీ స్టైల్‌, డాన్స్ మూమెంట్స్‌ను వ‌ర‌ల్డ్ సెల‌బ్రిటీలు వీడియోలు చేశారంటే అల్లు అర్జున్ మానియా ఏ రేంజ్‌లో అఫెక్ట్ చూపిందో అర్థం చేసుకోవ‌చ్చు.. దీంతో.. పుష్ఫ‌-2 రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మూవీ వ‌ర్గాల్లో చ‌క్కర్లు కొడుతోంది.

పుష్ప‌-2 మూవీ టీజ‌ర్‌ను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.. దీనిపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక్కడ మ‌రొక ఇంట్రెస్టింగ్ విష‌యం ఏమిటంటే.. పుష్ప‌కి ఉన్న క్రేజ్ కార‌ణంగా..పార్ట్ 2కు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌.. అంటే.. పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకముందే.. జరగబోయే ప్రమోషన్స్ కి ఈ టీజర్ వేదిక కానుంద‌న్న‌మాట‌.. ఇప్ప‌టికే ఓవర్సీస్ లో కూడా భారీ ఆఫర్లు వ‌స్తున్న‌ట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు.. అటు.. నార్త్ లో కూడా పుష్ప 2 కి భారీ క్రేజ్ ఉండడంతో ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ చాప్టర్ 2 తో పాటు టాప్ స్థానంలో ఉన్న బాహుబలి 2 సినిమాల కలెక్షన్ ని ఇది దాటేస్తుందని మ‌రి కొందరు అభిప్రాయపడుతున్నారు. మూవీకి ఫస్ట్ డే మంచి టాక్ లభిస్తే ఆ రెండు సినిమాల కలెక్షన్ ని ఇది డాట్ అవకాశం లేకపోలేదని బ‌న్నీ ఫ్యాన్స్ గ‌ట్టి న‌మ్మ‌కంగా ఉన్నారు.

మ‌రో వైపు కేజీఎఫ్ 2 టీజర్ 275 మిలియన్ వ్యూస్ తో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు మోస్ట్ లైక్స్ పొందిన టీజర్ గా నిలిచింది. మరే భారతీయ సినిమా టీజర్ కూడా ఈ టీజర్ కు దగ్గరగా లేదని టాలీవుడ్ టాక్.. దీంతో యూట్యూబ్ లో కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ ను పుష్ప 2 టచ్ చేయగలదా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప మూవీ ఊహించినదాని కంటే హిట్ అవ్వడం, అల్లు అర్జున్ నటన హైలైట్ గా నిలవడంతో ఈ రికార్డు కొట్టడం సాధ్యమేనని భావిస్తున్నారు సినీ క్రిటిక్స్.. చూడాలి మ‌రి ఇన్ని హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మోస్తున్న పుష్ప ఎలాంటి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడ‌తాడో మ‌రి..