ఢిల్లీతో శ్రేయాస్ డీల్ ఓకే.. కోల్ కత్తా RTMతోనే టెన్షన్

ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి వేలంలోకి పలువురు కెప్టెన్లు రావడంతో ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ ఖాయమైపోయింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కోసం ఓ రేంజ్ లో ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 04:15 PM IST

ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి వేలంలోకి పలువురు కెప్టెన్లు రావడంతో ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ ఖాయమైపోయింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కోసం ఓ రేంజ్ లో ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. తాజాగా శ్రేయాస్ అయ్యర్ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీల్ ఓకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. వేలంలో ఖచ్చితంగా శ్రేయాస్ దక్కించుకోవాలని ఢిల్లీ డిసైడయింది. వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను వదిలేసింది. అక్షర్‌ పటేల్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కుల్దీప్‌ యాదవ్‌లను మాత్రమే ఢిల్లీ రిటైన్‌ చేసుకున్న డీసీ పంత్ స్థానంలో శ్రేయాస్ కే మొగ్గుచూపుతోంది. ఐపీఎల్‌ 2024లో కోల్ కత్తాను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపునే శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ అతడిని 2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్‌ 2021 వరకు ఢిల్లీ ఫ్రాంచైజీకే అయ్యర్‌ ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్‌గా కూడా శ్రేయస్‌ వ్యవహరించాడు. ఐపీఎల్‌ 2020 సీజన్ లో అయ్యర్‌ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత అయ్యర్‌ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముందు విడిచిపెట్టింది. ఈ క్రమంలో అయ్యర్‌ స్ధానంలోనే తమ రెగ్యూలర్‌ కెప్టెన్‌గా రిషబ్‌ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు పంత్ తో విభేదాలు రావడంతో అతన్ని వదిలేసి శ్రేయాస్ ను తమ సారథిగా ఎంపిక చేసుకునేందుకు రెడీ అయింది. కాగా ఢిల్లీ పర్స్‌లో ప్రస్తుతం 73 కోట్లు ఉన్నాయి.

ఈ మొత్తంలో శ్రేయాస్ కోసం కనీసం 20 కోట్ల పైనే వెచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ ఫ్రాంచైజీకి కోల్ కత్తా నైట్ రైడర్స్ టెన్షన్ తెప్పిస్తోంది. ఎందుకంటే కోల్ కత్తా ఆర్టీఎం ఆప్షన్ ద్వారా శ్రేయాస్ అయ్యర్ ను దక్కించుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వేలం మరింత రసవత్తరంగా మారిపోయింది. గత సీజన్ లో సారథిగా సీజన్ ఆద్యంతం కేకేఆర్‌ను శ్రేయాస్ విజయపథంలో నడిపించాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్.. రింకూ సింగ్ , వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్ , ఆండ్రీ రసెల్ , హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్ లను రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆర్టీఎం ద్వారా శ్రేయాస్ కోసం కోల్ కత్తా కూడా బిడ్ వేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే నైట్ రైడర్స్ పర్స్ లో 51 కోట్లే ఉండడంతో శ్రేయాస్ కోసం ఎంతవరకూ వెళుతుందనేది చూడాలి.