శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం డబుల్ సెంచరీతో అదుర్స్

టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్ ఎట్టకేలకు పూర్తి ఫామ్ లోకి వచ్చేశాడు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో శ్రేయాస్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

  • Written By:
  • Publish Date - November 8, 2024 / 11:54 AM IST

టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్ ఎట్టకేలకు పూర్తి ఫామ్ లోకి వచ్చేశాడు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో శ్రేయాస్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. వ‌న్డే త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 201 బంతుల్లో త‌న తొలి ఫ‌స్ట్‌క్లాస్ డ‌బుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 228 బంతులు ఎదుర్కొన్న అయ్య‌ర్‌.. 24 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 233 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయ్య‌ర్‌తో పాటు సుద్దేశ్ లాడ్ విధ్వంసంతో ముంబై 602 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయ్య‌ర్ చివ‌ర‌గా ఇండియా త‌ర‌పున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడాడు. ఆ త‌ర్వాత రంజీల్లో ఆడాల‌న్న బీసీసీఐ అదేశాలు దిక్క‌రించ‌డంతో అయ్య‌ర్ త‌న సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఇప్పుడు రంజీల్లో రాణిస్తూ సెలక్టర్ల పిలుపుకు కోసం వెయిట్ చూస్తున్నాడు.