ICC RANKINGS: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నెం.1.. నెంబర్ వన్ బ్యాటర్ ఎవరంటే..

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ను వెనక్కి నెట్టి వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు శుభ్ మన్ గిల్. సచిన్, ధోనీ, కోహ్లీ తర్వాత వరల్డ్ నెం.1 బ్యాటర్ గా నిలిచిన నాలుగో ఇండియన్ ప్లేయర్ గా గిల్ ఘనత సాధించాడు. 4వ స్థానంలో కోహ్లీ,  6వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:21 PM IST

ICC RANKINGS: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన ర్యాంకుల జాబితాలో (ICC RANKINGS) లో వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ (Bating & Bowling) విభాగంలోనూ అగ్రస్థానంలో ఉన్నారు భారత ఆటగాళ్లు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ను వెనక్కి నెట్టి వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు శుభ్ మన్ గిల్ (Subhman Gill). సచిన్ (Sachin), ధోనీ(Dhoni), కోహ్లీ(Kohli) తర్వాత వరల్డ్ నెం.1 బ్యాటర్ గా నిలిచిన నాలుగో ఇండియన్ ప్లేయర్ గా గిల్ ఘనత సాధించాడు.

ICC WORLD CUP 2023: ఇండియాతో సెమీస్ ఆడే జట్టు ఏది..? ఈ రెండింట్లో ఛాన్స్ ఎవరికి..?

4వ స్థానంలో కోహ్లీ,  6వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. ICC వన్డే ర్యాంకింగ్స్ లో (ICC ODI Rankings)లో  వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన చిన్న వయస్కుడిగా గిల్ రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు శుభ్‌మన్ గిల్. ఐసీసీ వన్డే బౌలింగ్  ర్యాంకింగ్స్ లో తిరిగి నెంబర్ స్థానం దక్కించుకున్నాడు సిరాజ్.  T20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. T20,  వన్డే తో (ODI)  సహా టెస్ట్ ఫార్మాట్ లో నెంబర్ ర్యాంక్ ని టీమిండియా నిలబెట్టుకుంది.