Siddaramaiah: కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలవదు.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 06:40 PM IST

Siddaramaiah: రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ (KCR)ను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah). రాష్ట్రంలో కాంగ్రెస్ (CONGRESS) పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేసిన సందర్భంగా, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. “టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్.. 2 చోట్లా భారీ మెజార్టీతో గెలుస్తారు.

TELANGANA CONGRESS: బీసీ జపం మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. బీసీలపై హామీల వర్షం..

కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలవదు. నరేంద్ర మోడీ వంద సార్లు వచ్చినా ఆ పార్టీ అభ్యర్థులు గెలువరు. మోడీ కర్ణాటకలో 40 సార్లు ఎన్నికల ప్రచారం చేసినా ఓడిపోయారు. కర్ణాటకలో మోడీ మీద నమ్మకం పెట్టుకుని ఎన్నికల్లో బరిలోకి దిగిన వాళ్లు ఓడిపోయారు. నా రాజకీయ జీవితంలో ప్రధాని మోడీ ఆడిన అబద్దాలు ఎవరూ ఆడలేదు. మోడీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. దళితులకు, బీసీలకు, పేదలకు నరేంద్ర మోడీ చేసింది ఏమి లేదు. కర్ణాటకలో 5 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడితే.. బీజేపీ వ్యతిరేకించింది. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో చెప్పిన 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. కర్ణాటకలో గ్యారెంటీ పథకాలు అమలుకావట్లేదని కేసీఆర్ అన్నాడు. ఒక్కసారి కర్ణాటకకు వస్తే తెలుస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మోడీ, కేసీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మవద్దు. బీసీలకు, దళితులకు, అల్ప సంఖ్యాకులకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమే. బీజేపీకి బీఆర్ఎస్ బీ పార్టీ. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.