Siddaramaiah: కర్ణాటక రండి.. నిజాలు చూపిస్తాం.. కేటీఆర్‌కు సిద్ధ రామయ్య సవాల్

మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్‌ని కర్ణాటక వచ్చి మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని చెప్పాం. ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నా. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడూ మోసం చేయదు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుంది.

  • Written By:
  • Updated On - November 26, 2023 / 03:35 PM IST

Siddaramaiah: కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో అవాస్తవాలని, కర్ణాటకకు వస్తే నిజాలు చూపిస్తామని సవాల్ విసిరారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం రెండోసారి వచ్చాను. కామారెడ్డిలో ప్రచారం చేసా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. మేము ప్రభుత్వంలో ఏర్పడిన మొదటి క్యాబినెట్‌లోనే 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం.

Revanth Reddy’s open letter : స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

శక్తి యోజన ద్వారా మొదటి గ్యారంటీ స్కీమ్స్‌ని జూన్ 11న అమలు చేసాం. లక్షల మంది మహిళలు ఇప్పటి వరకు కర్ణాటకలో ఉచిత ప్రయాణం చేశారు. రోజుకు 62 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. నా భార్య.. మా మహిళా మంత్రులు కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల కోసం అబద్దాలు చెబుతున్నారు. కాని ఇతరులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. అన్నభాగ్య ద్వారా ఒకరికి 5 కేజీల బియ్యం ఇవ్వాలని హామీ ఇచ్చాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్ణాటకకి బియ్యం ఇవ్వకపోవడం వల్ల ఒక్కో కేజీకి 34 రూపాయలు చెల్లిస్తున్నాం. బియ్యం ఇవ్వాలని ఫుడ్ కార్పొరేషన్ ఇండియాని రిక్వెస్ట్ చేసాం. ఈ పథకం కింద 4 కోట్ల 37 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. జులై మొదటి వారం నుంచి అన్నభాగ్యని అమలు చేస్తున్నాం. గృహ జ్యోతి పథకాన్ని జులై నుంచి అమలు చేస్తున్నాం. దీని ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. గృహలక్ష్మి పథకం ద్వారా కోటి 17 లక్షల మంది మహిళలకు రూ.2000 చొప్పున అందిస్తున్నాం.

Kalyan Krishna: డాక్టర్‌ను బలి తీసుకున్న సినీ డైరెక్టర్‌..? వైసీపీ నేత తమ్ముడి బాగోతమే కారణమా..?

4 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నాం. 5వ గ్యారంటీ యువనిధి ద్వారా వచ్చే జనవరి నుంచి నిరుద్యోగులకు రూ.3 వేలు అందిస్తాం. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తాం. ఇప్పటి వరకు రూ.36 నుంచి రూ.38 వేల కోట్ల వరకు గ్యారంటీ స్కీమ్స్‌కి కేటాయించాం. వచ్చే సంవత్సరం రూ.58 వేల కోట్లు గ్యారంటీ స్కీమ్స్‌కి ఖర్చు చేతబోతున్నాం. ఇచ్చిన 165 హామీల్లో 158 ఇప్పటికే అమలు చేస్తున్నాం. బీజేపీ ఇచ్చిన 600 హామీలలో 10 శాతం మాత్రమే అమలు చేసింది. మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్‌ని కర్ణాటక వచ్చి మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని చెప్పాం. ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నా. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడూ మోసం చేయదు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుంది. కర్ణాటక దివాళా తీస్తుందని మోడీ అంటున్నారు. అందులో వాస్తవం లేదు. కర్ణాటకలో గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడానికి డబ్బులకు కొదవ లేదు. 100 శాతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీ స్కీమ్స్ కచ్చితంగా అమలు చేస్తాం. బీఆరెస్ నేతలు ఎప్పుడైనా కర్ణాటక రావచ్చు. యడియూరప్పని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు.

యాడ్యూరప్ప ఆరోపణల్లో వాస్తవం లేదు. బీజేపీపై 40 శాతం కమిషన్ ఆరోపణ కాంగ్రెస్ ది కాదు. కాంట్రాక్టర్లది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నాం. దశల వారిగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాక ముందు వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.430 ఉంటే.. ఇప్పుడు రూ.1200 ఉంది. తెలంగాణలో ధర్నా చేసింది కర్ణాటక రైతులు కాదు. కర్ణాటక రైతులు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారు. కేసీఆర్‌కి భయం పట్టుకుంది. వాళ్ళు బీఆరెస్ రైతులు. డిసెంబర్ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది. నేను కూడా వస్తా” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.